Dangerous Tree: తెలంగాణ రాష్టంలో ఈ మొక్క ఎక్కడ చూసినా కనబడుతుంది… డివైడర్ల మధ్యనే ఈ మొక్కలు నాటారు.. మొక్క నాటిన తరువాత… చాలా వేగంగా పెరుగుతుంది… చూడడానికి అందంగా కనబడినా… ఈ పర్యావరణానికి మాత్రం పనికి రాదు.. పలు పరిశోధనల్లో ఈవిషయం బయటపడింది. అయినప్పటికీ.. అధికారులు పట్టించుకోవడం లేదు.. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా… ఈ మొక్కలు ఎక్కువగా కనబడుతున్నాయి. కోనో కార్పస్ మొక్కల పెంపకాన్ని ఆపాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏ రోడ్డు చూసినా… కోనో కార్పోస్ మొక్కలు కనబడుతున్నాయి. హరితహారంలో భాగంగా ఈ మొక్కలను ఎక్కువగా నాటారు.. అయితే.. మొదటి నుంచీ… ఈ మొక్కల పెంపకంపై వివాదం నెలకొంది.. అమెరికాలోని ఫ్లోరిడా తీర ప్రాంతంలో.. ఈ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి.ఈ మొక్కకి.. మన దేశానికి ఎలాంటి సంబంధం లేదు.. అయితే. ఈ మొక్కతో ఎలాంటి లాభాలు లేవు.. చూడడానికి ఏపుగా కనబడుతుంది.
Also Read: Telangana Farmers: తెలంగాణ రైతులకు రాజస్థాన్ లో శిక్షణ.. వీటిపైనే..
ఈ మొక్క ఆకులు.. పశువులు తినవు.. కనీసం పక్షులు కూడా.. ఈ చెట్టుపై వాలవు.. కనీసం పిచ్చుకలు కూడ గూళ్లు పెట్టుకోవు… ఈ చెట్టు నీడన.. పచ్చి గడ్డి కూడా మొలవదు… భూగర్భజలాలు ఎక్కువగా వినియోగించే.. ఈ మొక్క వేర్లు భూ లోపల అడ్డచ్చే డ్రైనేజీ వ్యవస్థలను. పైపు లైన్లను కేబుళ్లను చీల్చుకొని వెళ్లాయి.. అన్నింటికి మించి కోనోకార్పొస్ మనవాళికి శ్వాస కోశ వ్యాధుల ముప్పు వాటిల్లింది. ఇప్పటికే.. పలు దేశాలు ఈ మొక్కను నాటడం లేదు.
ఈ మొక్క ప్రతికూల ప్రభావాలను గుర్తించి గతం లో ఈ మొక్క పెంపకాన్ని నిషేదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేసింది. అయితే చాలా వరకు ఈ ఉత్తర్వులు పట్టించుకోకుండా నాటేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మొక్కలే కనబడుతున్నాయి. కరీంనగర్లో… చాలా వరకు ‘వీటిని నాటారు..ఇప్పుడు నాలుగైదు మీటర్ల వరకు పెరిగిపోయాయి.. పలువురు సైన్స్ టీచర్లు కూడా.. ఈ మొక్క చాలా డేంజర్ అని చెబుతున్నారు.. కానీ… పెరిగిన చెట్లను ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.
Also Read: Hyderabad Metro: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..
విదేశీ మొక్క అయినా కోనోకార్పస్ మన వాతవరణ సమతౌల్యతను దెబ్బతీస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సముద్ర తీర ప్రాంతాల్లో పెరిగే మడ జాతి మొక్క అని వరిస్తున్నారు. పశువులు, పక్షులకు ఉపయోగపడని ఈ చెట్లు జీవ వై ద్యానికి ముప్పుగా తయారవుతయని శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఈ దేశీ మొక్కలను తొలగించాలని కోరుతున్నారు. మన వాతవరణానికి అలవాటి పడినా.. స్వదేశీ మొక్కలను నాటాలని కోరుతున్నారు. ఈవిషయం..ఇప్పుడు.. ఇప్పుడే బయటకు రావడంతో.. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీ లైనంత త్వరగా ఈ చెట్లను నరికి వేసి.. వేరే మొక్కలు నాటాలని కోరుతున్నారు.
Also Read : Cyber Crime: సైబర్ కిలాడీ అరెస్ట్.. ఎలా అరెస్ట్ చేశారంటే?
అంతేకాకుండా.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా. ఈ మొక్కల గురించి ప్రస్తావించారు. హరితహారం కింద..ఈ మొక్కలే నాటరాని చెప్పారు.. మొక్కలు నాటే విషయం లో జాగ్రత్త లు పాటించాలని ఆయన అంటున్నారు.కోనోకార్పస్ మొక్కతో అనర్థాలు ఎక్కువగా ఉన్నాయని వృక్ష శాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు.. వీటిని పెంచకూడదని అంటున్నారు. పర్యవరణానికి హానీ చేస్తుందని తెలుపుతున్నారు. అంతేకాకుండా.. అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని చెబుతున్నారు. ఇదే షయం పరిశోధనలో తెలిసిందని అంటున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు