Phirangipuram Crime: ఈ భూమిపై తల్లి ప్రేమను వెలకట్టలేనిదిగా చెబుతుంటారు. తల్లులు తమ సర్వస్వాన్ని బిడ్డలకు కోసం త్యాగం చేస్తుంటారు. వారే లోకంగా జీవిస్తుంటారు. రాత్రింబవళ్లు కంటికి రెప్పగా సంతానాన్ని కాపాడుకుంటుంటారు. అటువంటి విలువైన బంధానికి ఓ స్త్రీ కలంకం తెచ్చింది. ఓ మారుతల్లి తన పిల్లల పట్ల కర్కసంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని ఫిరంగిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరి పిల్లలపై మారుతల్లి లక్ష్మీ అత్యంత దారుణంగా ప్రవర్తించింది. కార్తిక్ అనే బాలుడ్ని గోడకేసి బలంగా విసిరి కొట్టిన ఆమె.. మరో బాలుడికి వాతలు పెట్టింది. తలకు తీవ్ర గాయం కావడంతో బాలుడు కార్తిక్ ప్రాణాలు విడిచాడు. మరో బాలుడు శరీరంపై వాతలకు తాళలేక పెద్దగా అరిచాడు. దీంతో స్థానికులు చూసి ఆ బిడ్డను లక్ష్మీ నుంచి రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read Also: Cm Revanth Reddy: అభివృద్ధిలో ఉరకలేద్దాం.. దేశానికి ఆదర్శమవుదాం.. సీఎం రేవంత్ సెన్సేషన్ స్పీచ్
లక్ష్మీతో సహజీవనం
అయితే చిన్నారుల తల్లి గతంలోనే చనిపోయింది. దీంతో తండ్రి సాగర్.. లక్ష్మీతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ప్రస్తుతం వారు సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోని పిల్లలపై లక్ష్మీ కర్కసంగా ప్రవర్తించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఒక స్త్రీ అయ్యుండి పిల్లల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆమెను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.