Bank Holidays April 2025: మరో రెండ్రోజుల్లో మార్చి నుంచి ఏప్రిల్ నెలలోకి అడుగుపెట్టనున్నాం. ఎప్పటిలాగే ఏప్రిల్ లోనూ (Bank Holidays April 2025) బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. ఆ రోజుల్లో బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి వినియోగదారులు తమ బ్యాంక్ లావాదేవీలను ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని బ్యాంక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏప్రిల్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు? తెలుగు రాష్ట్రాల్లో ఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయి? దేని కారణంగా హాలీడేస్ ఇచ్చారు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
15 రోజులు బంద్
సాధారణంగా బ్యాంకులకు సెలవులను రిజర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిర్ణయిస్తుంది. ఇందుకు సంబంధించి ముందుగానే ఓ సెలవుల క్యాలెండర్ ను రిలీజ్ చేస్తుంది. దీని ప్రకారం ఏప్రిల్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు లభించాయి. పండగలు, స్పెషల్ డేస్ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు కలిపి బ్యాంకులకు హాలీడేస్ ఇచ్చారు. ప్రతీ ఆదివారం, రెండో శనివారం సెలవులు వీటికి అదనం. మెుత్తంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు కలుపుకొని ఆర్బీఐ ఏకంగా 15 రోజుల సెలవులను ప్రకటించింది.
తెలుగు స్టేట్స్ లో బ్యాంక్ సెలవులు
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకు సెలవులను పరిశీలిస్తే ముందుగా తెలంగాణలో ఏప్రిల్ 5, 6, 10, 14, 18 తేదీల్లో సెలవులు ఉండనున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ లో 5వ తేదీ మినహా తెలంగాణ తరహాలో బ్యాంకులకు హాలీడేస్ ఉన్నాయి. ఇది కాకుండా ఏప్రిల్ 12, 26 రెండో, నాలుగో శనివారం కాబట్టి బ్యాంకులకు సెలవు ఉంటుంది. మెుత్తంగా తెలంగాణకు 11 రోజులు, ఏపీకి 10 రోజులు చొప్పున ఏపీలో బ్యాంక్ సెలవులు లభించనున్నాయి.
సెలవులు ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడంటే?
❄️ ఏప్రిల్ 1న ‘సర్హుల్’ (Sarhul), ఒడిశా డే, ఇదుల్ ఫితర్ సందర్భంగా ఝార్ఖండ్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 6 శ్రీరామ నవమిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 10న మహావీర్ జయంతి సందర్భంగా యావత్ దేశంలోని బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 13న వైశాక్, మహా విసుభ సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని చత్తీస్ గఢ్, ఝార్ఖండ్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 14న డాక్టర్. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 15న హిమాచల్ డే సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే పురస్కరించుకొని దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 19న ఈస్టర్ డేను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 20న ఈస్టర్ సండే సందర్భంగా దేశంలోని బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 21న గరియా పూజ సందర్భంగా త్రిపుర రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 29న మహారుషి పురుశురాం జయంతి సందర్భంగా గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు
❄️ ఏప్రిల్ 30న బసవ జయంతిని పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు