Vidadala Rajini
ఆంధ్రప్రదేశ్

Vidadala Rajini: రజినిపై మరో కేసు? ఈసారి ఫిర్యాదు ఎవరంటే?

చిలకలూరిపేట, స్వేచ్ఛ: Vidadala Rajini: శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్‌క్రషర్‌ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీపై మరో ఫిర్యాదు అందింది. గత ప్రభుత్వ హయాంలో విడదల రజినీ, ఆమె మరిది గోపిల అక్రమాలను తాను ప్రశ్నించాననే కక్షతో తన ఇంటిపై దాడి చేశారంటూ చిలకలూరిపేటకు చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు.

Also read: Miyapur Crime: సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో చైన్ స్నాచర్స్ హల్చల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

తమ కుటుంబాన్ని మానసికంగా హింసించారంటూ జిల్లా ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలంటూ సుబ్రహ్మణ్యం విన్నవించారు. 2022 ఏప్రిల్ నెలలో రజనీ అక్రమాలను తాను ప్రశ్నించానని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. వందలాది మంది రజనీ అనుచరులు వచ్చి తన ఇంటిపై దాడి చేశారని, ఫర్నిచర్‌ను సైతం ధ్వంసం చేశారని ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కాగా, విడదల రజనీ ఇప్పటికే ఒక కేసు ఎదుర్కొంటున్నారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!