Chandrababu - Pawan
Politics

Chandrababu – Pawan: చంద్రబాబుకు 14, పవన్ కు 73.. ఇంతకు ఇవేమిటంటే?

న్యూఢిల్లీ, స్వేచ్ఛ: Chandrababu – Pawan: తెలుగు రాష్ట్రాల అభ్యున్నతితో పాటు దేశం అగ్రగామిగా ఎదగాలని నిత్యం ఆకాంక్షించే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో 14వ స్థానంలో నిలిచారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక భాగస్వామిగా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీలకు ఊతం, పీ4 విధానం, అమరావతి పనులు వంటి పనులు ఆయనను శక్తివంతమైన వ్యక్తిగా నిలిపాయి. ఈ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 100 మంది జాబితాలో చోటు దక్కించుకున్నారు.

73వ ర్యాంకులో ఆయన నిలిచారు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పవర్ లిస్ట్ -2025ని శుక్రవారం విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మిగతా వ్యక్తుల విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానంలో నిలిచారు. గత ఏడాది 39వ ర్యాంకులో నిలిచిన ఆయన, ఈసారి 11 స్థానాలు మెరుగుపరచుకున్నారు. తెలంగాణలో ప్రజాపాలన, బీసీ కులగణన, డీలిమిటేషన్‌ వ్యతిరేక పోరాటం, రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అర్హులకు ఉచిత విద్యుత్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆయన బలాన్ని పెంచాయని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ విశ్లేషించింది.

Also read: Hight Court – Vishnupriya: విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనా? క్వాష్ పిటిషన్ కొట్టివేత

పుష్ప, పుష్ప-2 సినిమాల ద్వారా యావత్ దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 92వ ర్యాంకులో నిలిచాడు. కాగా, ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో కేంద్ర హోంమంత్రి అమిత్ ఉన్నారు. ఆ తర్వాత 3 నుంచి 10 ర్యాంకుల్లో వరుసగా విదేశాంగ మంత్రి జైశంకర్, మోహన్ భగవత్, నిర్మలా సీతారామన్, సీఎం ఆదిత్యనాథ్, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలు నిలిచారు. ఎంపీ ప్రియాంక గాంధీ 81వ ర్యాంక్, హైదరాబాద్ ఎంపీ ఓవైసీ 89వ ర్యాంకులో నిలిచారు.

స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!