Viral: నెట్టింట రోజూ ఎన్నో వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో కొన్ని క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. అయితే, ఎప్పుడూ ఏవి ట్రెండింగ్ లోకి వెళ్తాయో ఎవరూ కూడా చెప్పలేము. స్క్రోల్ స్క్రోల్ కి కొత్త కొత్త వీడియోలు వస్తుంటాయి. వాటిలో కొన్ని చూడటానికి చాలా ఫన్నీగా ఉంటాయి. మరి, కొన్ని చాలా భిన్నంగా ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో కొంత టైం స్పెండ్ చేసినట్లయితే, ఒక దాని తర్వాత ఒకటి వీడియోలు వస్తూనే ఉంటాయి. జుగాద్, ఫైట్, స్టంట్స్ ఇలా కొన్ని రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. అయితే, తాజాగా ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతోంది. అసలు, ఆ వీడియోలో ఏం ఉందో ఇక్కడ తెలుసుకుందాం..
కొందరు సుగంధ ద్రవ్యాల ప్యాకెట్లతో కొత్త కొత్త వైరైటీలు చేస్తుంటారు. ఇంకొందరు పాత స్కూటర్‌ను జ్యూస్ పాయింట్ గా మార్చేశారు. మన దేశంలో ఇలాంటివి తక్కువగానే కనిపిస్తాయి. కానీ, ఇతర దేశాల్లో చాలానే గమనించవచ్చు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, జుగాద్ తయారు చేయడంలో మనస్సు అద్భుతాలు చేసే వ్యక్తి మీకు కనబడుతూనే ఉంటారు. ఇక్కడైతే, ఓ వ్యక్తి జీన్స్ ప్యాంటు ను క్రికెట్ కిట్ బ్యాగ్ లా మార్చేశాడు.
Also Read: Police Jobs for 10th: పది అర్హతతో పోలీస్ ఉద్యోగాలు.. ఇక ఐదు రోజులే ఛాన్స్
ఇలాంటి క్రికెట్ కిట్ బ్యాగ్ మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇప్పటికి మీరు ఎన్నో రకాల క్రికెట్ కిట్ బ్యాగులను చూసి ఉంటారు. కానీ, పార్కులో సాధారణంగా ఆడుకునే అబ్బాయిలతో క్రికెట్ కిట్ బ్యాగులను మీరు చాలా అరుదుగా చూసి ఉంటారు. అతను చేతిలో బ్యాట్, బాల్, స్టంప్స్ పట్టుకుని మ్యాచ్ ఆడటానికి వెళ్తాడు. కానీ, ఒక వ్యక్తి బ్యాట్, బంతిని అద్భుతమైన క్రియోటివిటీతో అతను జీన్స్ ప్యాంటు ఒక కాలు అడుగు భాగనా సీలు వేసి, బ్యాట్ పట్టుకోవడానికి ఒక కిట్ బ్యాగ్ తయారు చేశాడు. ఇది మాత్రమే కాదు, దానిని తగిలించుకోవానికి ఒక తాడు కూడా వేశాడు. ఇప్పుడు, అతని జుగాద్ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.