Miyapur Crime
క్రైమ్

Miyapur Crime: సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో చైన్ స్నాచర్స్ హల్చల్.. అరెస్ట్ చేసిన పోలీసులు..

శేరిలింగంపల్లి స్వేచ్ఛ: Miyapur Crime: రోడ్డు పై వాకింగ్ చేస్తున్న వ్యక్తి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ముగ్గురు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేసి జూవెనల్ హోమ్ కు తరలించారు. ఈనెల 23వ తేదీన రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయం లో ముగ్గురు మైనర్ బాలలు ద్విచక్ర వాహనంపై చంద్రబాబు నాయుడు గెస్ట్ హౌస్ సమీపరోడ్డులో వెళ్తున్నారు.

అదే రోడ్ లో నార్ని ఎస్టేట్ లెగ్జీరియో రెసిడెన్సి లో నివాసముంటున్న చోప్పారపు రాజా పూర్ణచందర్రావు వాకింగ్ చేసి వెళ్తుండగా వెనుక నుండి ముగ్గురు మైనర్లు ద్విచక్ర వాహనంపై వచ్చి పూర్ణచందర్రావు మెడలో నుండి గొలుసును లాక్కుని పరారయ్యారు. దీంతో పూర్ణచందర్రావు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.

సి సి ఎస్, మియాపూర్ పోలీసుల సంయుక్తంగా విచారణ నిర్వహించారు. నిందితులైన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకొని విచారించగా చైన్ స్నాచింగ్ కు పాల్పడింది తామేనని అంగీకరించారు. వారి వద్ద నుండి మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకొని వారిని జువైనాల్ హోమ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Hyderabad Crime: పసికందు చేసిన పాపమేమి? బిడ్డను బకెట్ లో ముంచి మరీ చంపిన తల్లి

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!