Police Jobs for 10th: మనలో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు. చదువుకుని కూడా సరైన ఉద్యోగాలు దొరకక చాలా మంది ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొందరైతే కుటుంబాన్ని పోషించడానికి ఏదొక జాబ్ చేస్తుంటారు. ఇక, పది చదివిన వాళ్ళకైతే ఉద్యోగాలు ఎప్పుడో ఒకసారి పడుతుంటాయి. తాజాగా, సిఐఎస్ఎఫ్ గుడ్ న్యూస్ చెప్పింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) రిక్రూట్‌మెంట్ లో భాగంగామొత్తం 1161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ దరఖాస్తు 05-03-2025న ప్రారంభమై 03-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి CISF వెబ్‌సైట్, cisfrectt.cisf.gov.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ ఖాళీల నియామకానికి ఉపాధి నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అధికారికంగా కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నియామక ప్రక్రియ, అర్హత, దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను సందర్శించండి. అర్హత గల అభ్యర్థులు ఈ cisfrectt.cisf.gov.in లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
దరఖాస్తు రుసుము:
UR, OBC, EWS అభ్యర్థులు: రూ.100/-
మహిళా అభ్యర్థులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మాజీ సైనికుల వర్గాలకు చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
ISF కానిస్టేబుల్ ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ 2025 వయోపరిమితి
కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు
గరిష్ట వయోపరిమితి: 23 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది
Also Read: OTT Movies: ఈ వీకెండ్ చాలా స్పెషల్.. ఓటీటీలోకి 4 క్రేజీ చిత్రాలు!
వేతనం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలవెన్సులతో పాటు పే లెవల్-3 రూ.21,700-69,100/- వరకు చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు
CSC రిక్రూట్‌మెంట్ 2025 ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 05-03-2025
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 03-04-2025