AP Elections (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Elections: ‘లోకల్’లో వైసీపీ స‌త్తా.. కూటమి కేర్ చేయలేదా? అసలు మతలబేంటి?

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జడ్పీలు, మండల పరిషత్‌లలో మొత్తం 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో ఏకంగా 32 పదవులను వైసీపీ కైవసం చేసుకున్నది. నిజానికి ఆ 53 పదవులూ గతంలో వైసీపీవే. పలు కారణాలతో ఖాళీ కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే సంఖ్యా బలం లేకపోయినా కూటమి పార్టీలు బరిలోకి దిగడం గమనార్హం.

అధికారంలో ఉండి కూడా 9 స్థానాలకే టీడీపీ పరిమితం కావడంతో బరిలోకి దిగి విమర్శలపాలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి. అయితే వైసీపీ సభ్యులు టీడీపీలోకి రావడంతో టీడీపీ గెలుపొందినది. అయితే టీడీపీ బాటలోనే చెరో ఎంపీపీని జనసేన, బీజేపీ పార్టీలు కైవసం చేసుకున్నాయి. మరోవైపు 10 చోట్ల కోరం లేకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కూటమి నేతల దౌర్యన్యాల కారణంగా వాయిదా పడ్డాయని వైసీపీ ఆరోపిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే లోకల్‌ ఫైట్‌లో వైసీపీ సత్తా గట్టిగానే చాటిందని చెప్పుకోవచ్చు.

ఎన్నో.. ఎన్నెన్నో..
స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన పదవులు చేజిక్కించేందుకు కూటమి నేతలు చేసిన అన్ని రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, దౌర్జన్యాలు, దాడులతో దొడ్డిదారిన గెలవాలనకున్న కూటమి నేతల ఆశలను వైసీపీ అభ్యర్థులు అడియాశలు చేశారు. గుండెనిబ్బరంతో నిలబడి పోరాడి విజయం సాధించారని వైసీపీ చెబుతోంది.

కడప జిల్లా జడ్పీ చైర్మన్‌గా వైసీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోర్టు ద్వారా ఎన్నికను అడ్డుకోవాలని కూటమి నేతలు చివరి వరకు ప్రయత్నాలు చేసి విఫ‌ల‌మ‌య్యారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి పెసరవెల్లి రమాదేవి గెలుపొందారు. ఎంపీపీ ఎన్నికకు టీడీపీ సభ్యుల గైర్హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి నాగమ్మ విజయం సాధించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఎంపీపీగా బండి లక్ష్మీదేవి, అనంతపురం జిల్లా కంబదూర్ ఎంపీపీగా కురుబ లక్ష్మీదేవి ఏకగ్రీవమయ్యారు. ఇక కర్నూలు జిల్లా తుగ్గలి ఎంపీపీగా రాచపాటి రామాంజినమ్మ, తిరుపతి రూరల్ ఎంపీపీగా మూలం చంద్రమోహన్ విజయం సాధించారు.

ఏకగ్రీవాలే ఎక్కువ..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైయస్ఆర్‌సీపీ అభ్యర్థి ఆల్ల సుబ్బమ్మ గెలుపొందారు. చిత్తూరు జిల్లా తవణంపల్లి ఎంపీపీగా పట్నం ప్రతాప్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఖాజీపేట వైస్ ఎంపీపీ స్థానాన్ని వైయస్సార్ సీపీ అభ్యర్థి ముమ్మడి స్వప్న గెలిపొందారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండల పరిషత్ అధ్యక్షుడిగా రుత్తల సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు.

మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ఆధ్వర్యంలో 10 మంది వైసీపీ ఎంపీటీసీలు మండల కార్యాలయం చేరుకున్నారు. బలం లేక టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గడంతో సర్వేశ్వరరావు ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్నూలు వెల్దుర్తి ఎంపీపీ పదవి వైసీపీ కైవసం చేసుకుంది. ఏకగ్రీవంగా దేశాయి లక్ష్మీదేవి ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా పీవీపాలెం ఎంపీపీగా పీటీసీ సీతారామరాజు ఎన్నికయ్యారు.

బాయ్ కాట్.. వాయిదా
పల్నాడు జిల్లా నరసరావుపేట వైస్ ఎంపీపీ, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అరాచకం సృష్టించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి ఎంపీపీ, చిత్తూరు జిల్లా రామకుప్పం ఎన్నికలు వాయిదాపడ్డాయి. అయితే నరసరావుపేట వైస్ ఎంపీపీ, ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. కోరం లేకపోవడంతో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. కాగా, పల్నాడు జిల్లా అచ్చంపేట ఎంపీపీ, రామకుప్పంలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు.

Also Read: Mega Fans: మెగాస్టార్ ఓల్డ్ ఫోటో వైరల్.. దమ్ముందా అంటున్న మెగా ఫ్యాన్స్!

అయితే కాకినాడ రూరల్ ఎంపీపీగా జనసేన ఎంపీటీసీ అనంతలక్ష్మీ ఏకగ్రీవమవ్వగా, వైసీపీ ఎంటీసీలు బహిష్కరించారు. తూర్పగోదావరి జిల్లా బిక్కవోలు ఎంపీపీ పదవిని బీజేపీ సొంతం చేసుకుంది. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవి, అల్లూరి జిల్లా జి.మాడుగులు ఎంపీపీ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి ఎంపీపీ ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది. యలమంచిలి ఎంపీపీ ఎన్నిక నిర్వహించాల్సిందేనని డిమాండ్ చేశారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ