ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ: Panchayat Raj Lokesh Kumar: సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదటమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు.గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, సెర్ఫ్ కార్యక్రమాల పై సెర్ఫ్ సీఈఓ డి. దివ్య తో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్ లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపి కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నిర్ణయించారన్నారు. ప్రస్తుతం 33 శాతం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50 శాతానికి పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.జిల్లాలలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు లక్ష్యం మేరకు కొనుగోలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపి లకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్ లకు తెలిపారు.
ఐకెపి కొనుగోలు కేంద్రాలకు అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలన్నారు.నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌరసరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమీషన్ మహిళా సంఘాలకు అందడం లేదని దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమీషన్ చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. స్వశక్తి మహిళా సంఘాలచే రైస్ మిల్లుల ఏర్పాటు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. పౌర సరఫరాల శాఖ, సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలన్నారు.
Also Read: Vakiti Srihari: మంత్రి రేసులో గాంధేయవాది.. ఆయన ప్రస్థానానికి సెల్యూట్ చేయాల్సిందే!
దివ్యాంగులకు యూ.డి.ఐ.డి. కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి దివ్యాంగులకు నిర్ధారణ పరీక్షల నిర్వహణ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.నిర్ధారణ క్యాంపుల నిర్వహణ కోసం ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ లకు సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ కార్యాలయాల్లో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు.
కుటుంబంలో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న వృద్దులు ఎవరైనా మరణిస్తే, వారి జీవిత భాగస్వామికి అర్హత ఉంటే వెంటనే పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ లకు సూచించారు. డిఆర్డిఓ, ఎంపిడిఓ, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమీషనర్లతో సమావేశం నిర్వహించి ఇటువంటి కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.3 నెలలు ఫించన్ తీసుకోని లబ్దిదారులు వలస వెళ్లినట్లు సిస్టమ్ నమోదు చేస్తుందన్నారు. వలస వెళ్లినట్లు నమోదు అయిన వివరాలను అధికారులు పరిశీలన చేసుకొని పెన్షన్ తీసుకోక పోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని, లబ్ధిదారులు మరణిస్తే వివరాలను అప్ డేట్ చేయాలన్నారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలను స్వశక్తి మహిళా సంఘాలతో ట్యాగింగ్ చేసి స్కూల్ యూనిఫాం కుట్టు ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాలని అన్నారు. స్కూల్ యూనిఫాం కుట్టు పనులకు సంబంధించి అవసరమైన కటింగ్ మిషన్, ఇతర పరికరాలు సిద్ధం చేసుకోవాలని, మహిళా సంఘాల ద్వారా కుట్టు పనులు వేగవంతం అయ్యేలా చూడాలని, జూన్ నెల వరకు ఈ పనులు పూర్తి కావాలన్నారు.స్కూల్ యూనిఫామ్ కుట్టు పనులకు సంబంధించి కూలీ క్రింద 50 రూపాయలు మాత్రమే వచ్చినట్లు మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారని, దీనిని క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పరిశీలన చేసి పెండింగ్ చెల్లింపులకు సంబంధించిన బిల్లులు సమర్పించేలా చూడాలని, ప్రభుత్వానికి సమర్పించిన ప్రతి బిల్లు చెల్లింపు పూర్తవుతుందన్నారు.స్వశక్తి మహిళ సంఘాల ద్వారా సృష్టించబడిన స్టిచ్చింగ్ సెంటర్ లు పూర్తి స్థాయిలో వినియోగించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు యూనిఫామ్ కుట్టిన తర్వాత ప్రైవేట్ గా కూడా కుట్టు పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read: Ugadi 2025: ఉగాది పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు.. నిధులు కేటాయించిన ప్రభుత్వం
మహిళా సంఘాల ద్వారా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని, ముందుగా జిల్లా స్థాయిలో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తించాలని అధికారులకు సూచించారు. అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల స్థాయిలలో కూడా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు కార్యాచరణ ఉంటుందని ఆయన అధికారులకు తెలిపారు.మహిళలచే చేపట్టే పెట్రోల్ బంక్ లలో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్, పిల్లలు ఆడుకునేందుకు ఆట స్థలం, క్యాంటీన్, చిన్న హోటల్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఉండాలన్నారు. మహిళా శక్తి మాల్స్ ఏర్పాటు కూడా అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.ఇందిరా మహిళా శక్తి బజార్ కింద షాప్స్ ఏర్పాటుకు ప్రతి జిల్లాకు లక్ష్యాలు నిర్దేశించడం జరిగిందన్నారు. ఇందిరా మహిళా శక్తి బజార్ లలో ప్రజలకు అవసరమైన సామాగ్రి అందుబాటులో ఉండాలని, బజార్ ఎల్లప్పుడూ ప్రజలతో కిటకిటలాడేలా ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలలో వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్స్ రద్దు చేసిన పెట్రోల్ బంక్ లను మహిళా సంఘాలకు కేటాయించాలన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, సాధారణ బీమా పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని, మరణించిన మహిళా సంఘాల సభ్యుల సరైన డాక్యుమెంట్ లను పరిశీలించి సరైన లబ్ధిదారులకు ఈ సహాయం అందేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించి జిల్లాలో ఎంతమంది మహిళా సంఘాల సభ్యులు మరణించారు, వారిలో ఎంత మందికి ప్రమాద బీమా, సాధారణ భీమా అమలు అవుతుంది పరిశీలించి సంబంధిత లబ్ధిదారులకు సహాయం అందజేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ, గతంలో ఖమ్మం జిల్లాలో ఉన్న 37 ఐకేపీ కేంద్రాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుత యాసంగి సీజన్లో 137 కు పెంచడం జరిగిందన్నారు. 2022-23 సంవత్సరానికి సంబంధించిన కమీషన్ పౌర సరఫరాల శాఖ వద్ద పెండింగ్ ఉందన్నారు. గన్ని బ్యాగులు రీకన్సిలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావాల్సి ఉందని అన్నారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ సన్యాసయ్య, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ జి. శ్రీలత, డి.ఈ.ఓ. సోమశేఖర శర్మ, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విజయలక్ష్మి, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.
Also Read: MLA Sambasiva Rao: కాళేశ్వరం కంటే ఆ ప్రాజెక్ట్ బెటర్.. సీపీఐ నేత ఆసక్తికర వ్యాఖ్యలు