మహబూబ్ నగర్ స్వేచ్ఛ : Vakiti Srihari: మూడు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని,నాటి తెలుగుదేశం పార్టీ నుండి, నేటి బి ఆర్ యస్ పార్టీ వరకు ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన, ఒత్తిళ్లకు గురిచేసినా వాకిటి శ్రీహరి మాత్రం కాంగ్రెస్ వాకిలిని వదలలేదు. 1995లో రాజకీయ ఆరంగేట్రం చేసిన వాకిటి శ్రీహరి 2001-2006లో ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే రికార్డు స్థాయి మెజార్టీని సాధించి మక్తల్ సర్పంచ్ గా గెలుపొందారు. అదే సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులుగా కూడా కొనసాగారు. 2006-2011 వరకు మక్తల్ మండలంలోని దాసరిపల్లి ఎంపిటిసిగా ప్రాతినిధ్యం వహించారు. 2014-2018 లో మక్తల్ జడ్పిటిసి గా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ జెడ్పి ఫ్లోర్ లీడర్ గా బాధ్యతలు నిర్వహించారు.
2006-2014 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 2018 నుండి నేటి వరకు కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడుగా కూడా కొనసాగుతున్నారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం అవ్వడానికి వాకిటి కీలక భూమిక వహించారు. 2023లో ఎంతోమంది ఉద్దండులను సైతం పక్కనపెట్టి వాకిటి శ్రీహరికి అప్పటి పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి వాకిటికీ టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి జలంధర్ రెడ్డి లాంటి బలమైన నాయకులను కాదని వాకిటి శ్రీహరి కి ప్రజలు పట్టం కట్టారు. సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటిస్తామని అప్పటి పిసిసి అధ్యక్ష హోదాలో, ఎంపీ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే.
Also Read: Minister Seethaka: మహిళలకు సూపర్ ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన మంత్రి సీతక్క..
సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి వరించనుందని బహిరంగంగానే ప్రకటించిన విషయం బహిరంగ రహస్యమే…
కాగా… ఈ 15 నెలల కాలంలో వాకిటి శ్రీహరికి మంత్రి పదవి అవకాశం రాకుండా కొంతమంది పనిగట్టుకుని మరి సోషల్ మీడియాలో వాకిటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఎంతో స్థితప్రజ్ఞత ప్రదర్శించిన వాకిటి, తన రాజకీయ పరిపక్వతను హుందాతనాన్ని ఎక్కడ కోల్పోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత విధేయుడుగా వ్యవహరించారు. ఈ 15 నెలల కాలంలో ఎమ్మెల్యేగా వాకిటి ఎప్పుడూ కూడా తన దర్పాన్ని ప్రదర్శించలేదు. అందరికీ తలలో నాలుకలా శత్రువులేని అజాతశత్రువులా వాకిటి వ్యవహరించారు.
Also Read: BRS MLAs Walks Out: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్.. దెబ్బకు విపక్ష పార్టీ వాకౌట్
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన ఈ సందర్భంలో వాకిటి శ్రీహరి పేరు ఇక లాంఛనమే….
మక్తల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత రామచంద్ర రావు కళ్యాణి, ఎల్కోటి ఎల్లారెడ్డిల తదుపరి వాకిటి శ్రీహరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మూడో వ్యక్తి . అత్యంత సౌమ్యుడిగా, అందరివాడుగా ముద్రపడ్డ వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరిస్తుందన్న వార్తల నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు