BRS MLAs Walks Out [ image credit: twitter]
తెలంగాణ

BRS MLAs Walks Out: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్.. దెబ్బకు విపక్ష పార్టీ వాకౌట్

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ : BRS MLAs Walks Out: బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రవేశపెట్టిన హొమ్, నీటి పారుదల, రెవెన్యూ, ప్రాజెక్టుల పద్దులపై చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ నేతల మధ్య వాదనలు చోటుచేసుకున్నారు. రెవెన్యూ పద్దులో భాగంగా బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ భారతి పోర్టల్ పై మాట్లాడుతూ ధరణీతో ఎంతో మందికి భూ హక్కు కల్పించామని గణాంకాలను వివరిస్తూనే, ధరణి డేటాతోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నారని, ధరణిని తొలగించి దాని స్థానంలో భూ భారతి తీసుకువస్తే మళ్లీ భూపోరాటాలు వస్తాయని వ్యాఖ్యానించగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి భూ మాతపై సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.

సాయుధ రైతాంగ పోరాటంతోనే కాంగ్రేస్ ప్రజలకు భూమిపై హక్కుల కల్పించిందని, దున్నే వాడిదే భూమి అంటూ తెలంగాణ టెండెన్సీ యాక్టు ప్రకారం కాంగ్రేస్ పార్టీ అనేక భూ సంస్కరణలను తీసుకువచ్చిందన్నారు. ఉద్యమాల ద్వారా వచ్చిన చట్టాలకు ధీటుగా ధరణి తీసుకువచ్చి, కొన్ని లక్షల మంది రైతులు హక్కులు కొల్పోయారన్నారు. ధరణితో బీఆర్ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా భూములు సంపాదించుకున్నారని, ఇష్టారాజ్యంగా ధారాదత్తం చేశారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

Also Read: Degree Jobs: డిగ్రీ పాసయ్యారా.. బ్యాంక్ జాబ్ మీ కోసమే ..!

ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా బీఆర్ఎస్ నేతలు తమ పేర్లపై భూములు ఎక్కించుకున్నారని, నిజమైన హక్కుదారుడికి కనీస అప్పీలు లేకుండా, దుర్మార్గమైన ధరణిని తెచ్చి, అసలైన యజమానికి భూ హక్కు లేకుండా చేశారన్నారు. అమ్మి అమెరికాకు వెళ్లిపోయిన వారి వారసులు ఎదో పేపర్లు పట్టుకుని ఈ భూమికి తమకు చెందినదంటూ వస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.

డిప్యూటీ సీఎం మాట్లాడుతుండగానే బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని ధరణి స్థానంలో సర్కారు తీసుకురానున్న భూ భారతి కాదని, అది భూ హారతి అంటూ వ్యాఖ్యానించారు. కొత్త పోర్టల్ తీసుకువచ్చి కౌలు రైతు విషయంలో వివాదం సృష్టించటమేనని వ్యాఖ్యానించారు. 2011లో బంద్ అయిన జమా బందీ, అనుభవదారు కాలమ్ మళ్లీ పెట్టారన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క అన్నారని, నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి పేదలకు ఫ్రీ రెగ్యులరైజేషన్ చేయాలని పల్లా డిమాండ్ చేశారు.

Also Read: Pastor Praveen Pagadala: రచ్చ రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు.. ప్రభుత్వ స్పందన ఇదే!

బరితెగించి, దోపిటీ చేయటానికి రాలే: డిప్యూటీ సీఎం భట్టి

పల్లా వ్యాఖ్యలను తప్పుబడుతూ చర్చ అనేది వాస్తసంగా ఉండాలే గానీ, సభను తప్పుదోవ పట్టించేలా ఉండొద్దని డిప్యూటీ సీఎం సూచిస్తుండగా, కేటీఆర్ జోక్యం చేసుకుని కొత్తగా సభకు కాంగ్రేస్ పార్టీకి చెందిన 53 మంది వచ్చారని, ప్రతిపక్షంగా చేయని పనులపై మేం ప్రశ్నిస్తామని అంటూనే ఏ పనికైనా 30 శాతం కమిషన్ అంటూ వారి ఎమ్మెల్యేలే చెబుతున్నారని అనటంతో భట్టి జోక్యం చేసుకుని 30 శాతం కమిషన్ ను మీరు చూశారా?మేం బాధ్యతగా రాజకీయాల్లోకి వచ్చాం. దోపిడీ చేయటానికి రాలేమని, ఉన్నతమైన ఆలోచనతో వచ్చామని డిప్యూటీ సీఎం అన్నారు.

దోపిడీ చేసి, సర్వనాశనం చేశారని, మాట్లాడేటపుడు బాధ్యతగా ఉండాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి గట్టిగా మాట్లాడే సరికి కాంగ్రేస్ సభ్యులు లేచి కమిషన్లను మాట్లాడినందుకు కేటీఆర్ సభకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రేస్ సభ్యుల మధ్య వాదనలు చోటుచేసుకోవటంతో సభలో స్వల్ప గందరగోళం నెలకొంది. భట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను అవమానించేలా వ్యవహారించారని, నేడు ఆయన డిప్యూటీ సీఎం పదవీలో ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేకనే అవమానపరిచేలా బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడుతున్నారంటూ, అసలు బీఆర్ఎస్ వైఖరేమిటీ? భట్టి ఆర్థిక మంత్రిగా ఉండటం జీర్ణించుకోలేకపోతున్నారని, అర్థవంతమైన చర్చ జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్,విప్ ఆది శ్రీనివాస్ వాదించారు.

Also Read: Case on Bandi Sanjay: బండి సంజయ్ కు ఊహించని ఝలక్.. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు!

డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలి: హరీశ్
ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించటం పట్ల అభ్యంతర వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు జోక్యం చేసుకుని డిప్యూటీ సీఎం వేంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా, ఆయనతో పాటు పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి,వేముల ప్రశాంత్, డాక్టర్ సంజయ్, లు స్పీకర్ పొడియం వద్ద వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో స్పీకర్ రేవూరి ప్రకాశ్ రెడ్డి బీఆర్ఎస్ సభ్యులు మైక్ లను ఆపేశారు. మాట్లాడేందుకు అవకాశమివ్వాలని అడుగుతుండగానే కేటీఆర్ మాట్లాడేందుకు అవకాశమివ్వాలని కోరగా, కేటీఆర్ కు మైకు ఇవ్వలేమని ప్యానల్ స్పీకర్ ప్రకాశ్ రెడ్డి తేల్చి చెప్పగా, కనీసం మైకు పల్లాకైన ఇవ్వాలని కోరారు. సీఎం బట్టలిప్పి కొడతా అంటారు, డిప్యూటీ సీఎం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటారు, ఇదేమిటీ అని ప్రశ్నిస్తూనే డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనందుకు నిరసనగా 30 పర్సెంట్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు.

కేటీఆర్ ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి : స్పీకర్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైక్ ను కట్ చేసిన తర్వాత ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ 30 శాతం కమిషన్ అనే పదాన్ని కేటీఆర్ ఉపసంహరించుకోవాలని సూచింగా, మరి వారి వ్యాఖ్యాలు ఉపసంహరించుకుంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. స్పీకర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తూ నన్ను మాట్లాడినియ్యకుంటే నేనేం ఏం చేయాలి, మీరు మాట్లాడిన అన్ పార్లమెంట్ కామెంట్లను రికార్డుల్లో నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు. నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేశారు

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?