కాకినాడ స్వేచ్ఛ: TDP vs Janasena: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలకు ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసలే మాజీ ఎమ్మెలే వర్మ తనకు ఎలాంటి పదవులు రావట్లేదని, అధిష్టానం పట్టించుకోలేదని రగిలిపోతున్నారు. ఈ పరిస్థితుల్లోనే పిఠాపురం జనసేన ఆవిర్భావ సభా వేదికగా మెగా బ్రదర్, ఆ పార్టీ కీలక నేత కొణిదెల నాగబాబు చేసిన కామెంట్స్‌తో వర్మ అనుచరులు, కార్యకర్తలు గుర్రున ఉన్నారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన ఇన్‌ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. తమ నాయకుడు వర్మ చెప్పబట్టే పవన్ కళ్యాణ్‌కు ఓటేశామని కార్యకర్తలు, నేతలు చెప్పారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు మర్రెడ్డి వచ్చారు.
TTD Update: టీటీడీ ట్రస్ట్‌లకు భారీ విరాళాలు.. అంతా కోట్లల్లోనే..
అందని ఆహ్వానం
అయితే, ఈ కార్యక్రమానికి వర్మకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది, ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు