తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Komatireddy Rajagopal Reddy: బీఆర్ఎస్ పార్టీ నయీం ఆస్తులను దోచుకుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో బుధవారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలకు సైరన్ చప్పుడు.. బుగ్గకారు లేకపోవడంతో నిద్రపట్టడం లేదన్నారు. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యంను ఖూనీ చేసిందన్నారు. సింగరేణికి దామచర్ల 200కిలో మీటర్ల దూరం లోఉందని అయినా ఇక్కడ థరల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. కరెంటు అంటేనే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటేనే కరెంటు అన్నారు. రైతులకు ఉచిత పథకాలు తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు.
బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిదిద్దుతూ సంస్కరణలు తీసుకొస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందన్నారు. బీఆర్ఎస్ పాలనలో సభలో ప్రతిపక్షం లేకుండా చేశారని, మేము చేయబోమన్నారు. సీఎం మంచి వ్యక్తి కావడంతో ఊరుకుంటున్నారన్నారు. ఇప్పటివరకు ఒక లెక్క..ఇక నుంచి మరోలెక్క అని హెచ్చరించారు. గత పాలకులు అధికారులను అడ్డంపెట్టుకొని పాలన చేశారన్నారు. మీరు రెచ్చగొట్టినా మీ ట్రాప్ లో పడబోమని స్పష్టం చేశారు.
Also Read: Minister Seethaka: మహిళలకు సూపర్ ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన మంత్రి సీతక్క..
ఒక కుటుంబ పార్టీకాదు.. ప్రాంతీయ పార్టీకాదు.. మాది జాతీయపార్టీని వెల్లడించారు. ఒక్కరోజూ కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నామని, దీంతో బీఆర్ఎస్ నేతలకు నిద్రపట్టడం లేదని దుయ్యబట్టారు. అవినీతి, అహంకారపూరిత పాలన గత పదేళ్లు జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారన్నారు. శ్రీరాంపూర్ ప్రాజెక్టుకు నీరు వచ్చింది లేదని, కానీ పోలీసులను అడ్డంపెట్టి రైతుల భూములను తీసుకున్నారని ఆరోపించారు. నల్లగొండలో ఇసుకమాఫీయా, సెంటిమెంట్లు చేశారని మండిపడ్డారు.
Also Read: BRS MLAs Walks Out: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్.. దెబ్బకు విపక్ష పార్టీ వాకౌట్
ప్రధానప్రతిపక్షంగా సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ గొంతునొక్కారని, అప్పుడు ప్రజాస్వామ్యం ఎటుపోయిందని… ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ లేదని, వెయ్యి జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదన్నారు. హుందాగా ప్రవర్తించండి.. రెచ్చగొట్టుద్దు అని సూచించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా తెలివి కళ్లొళ్లు లేరని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కంటే మంచిగా రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తున్నామని, అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు