అమరావతి, స్వేచ్ఛ: Deepam 2.0 Scheme: దీపం 2.O పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే (మార్చి 31) గడువు ఉంటుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గ్యాస్ సిలిండర్ పొందనివారు, తొలిసారి గ్యాస్ పొందేందుకు సత్వరమే బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏప్రిల్ 1 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ మొదలవుతుందని చెప్పారు. ఏటా ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్యలో మూడు సిలిండర్ల బుకింగ్‌కు అవకాశం ఉంటుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Also Read: Water Bell system: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాటర్ బెల్ వచ్చేసింది..!
దీపం 2.O పథకానికి ప్రభుత్వం రూ.2,680 కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. మహిళలకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 98 లక్షల మంది తొలిసారి ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందారని ఆయన వెల్లడించారు. గతేడాది నవంబర్ 1న సీఎం చంద్రబాబు దీపం 2.O పథకాన్ని ప్రారంభించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇంకా ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకుంటే వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
Also Read: MLA Sambasiva Rao: కాళేశ్వరం కంటే ఆ ప్రాజెక్ట్ బెటర్.. సీపీఐ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు నింపుతోందని ఆయన చెప్పారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా దీపం 2.O పథకాన్ని రూపొందించాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాగా, ఎల్‌పీజీ కనెక్షన్ కలిగి ఉండడంతో పాటు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, రైస్ కార్డు అనుసంధానం అయిన వాళ్లు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు