Water Bell system image source twitter
అమరావతి, ఆంధ్రప్రదేశ్

Water Bell system: విద్యార్థులకు గుడ్ న్యూస్.. వాటర్ బెల్ వచ్చేసింది..!

Water Bell system: రాష్ట్రంలో వేసవితాపం పెరిగిపోయింది. తీవ్ర ఎండల దృష్ట్యా స్కూల్ విద్యార్థులకు ఒంటిపూట బడులు కొనసాగుతున్నాయి. అయితే, విద్యార్థులు సకాలంలో మంచినీళ్లు తాగి అందరూ హైడ్రేటెడ్‌గా ఉంచేలా చూడడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో వినూత్నంగా ‘వాటర్ బెల్’ను ప్రవేశపెట్టింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య మొత్తం మూడు సార్లు వాటర్ బెల్స్‌ను మోగించనున్నారు. ఆ సమయంలో విద్యార్థులు అందరూ మంచినీళ్లు తాగాలి.

10 గంటలకు ఒకసారి, 11 గంటలకు రెండోసారి, 12 గంటలకు మూడోసారి వాటర్ బెల్ మోగించాలని సూచిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ బెల్ సమయాల్లో పాఠాలు బోధించడం ఆపివేసి విద్యార్థులు అందరూ నీళ్లు తాగే వరకు చూడాలని ఉపాధ్యాయులను విద్యాశాఖ ఆదేశించింది. వాటర్ బాటిల్ తీసుకొచ్చుకోని విద్యార్థులకు స్కూల్లో ఆర్‌ఓ సిస్టమ్ ద్వారా నీళ్లు అందించాలని స్పష్టం చేశారు.

Also Read: BRS Party: గులాబీ దళంలో.. డిప్యూటీ లీడర్లు లేనట్లేనా?

అంతేకాదు, డ్రింక్ వాటర్ ఎవ్రీ అవర్, స్టే కూల్, స్టే సేఫ్ వంటి ఆకర్షణీయమైన పోస్టర్లను కూడా తరగతి దుల్లో అంటించాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వాటర్ పాయింట్ల వద్ద కూడా ఇలాంటి పోస్టర్లు ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

Just In

01

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం