Ugadi 2025: తెలుగువారి ప్రతిష్టాత్మక పండగ ఉగాదిని ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు ఉత్సవాలకు రూ.5 కోట్లు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 30న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఉగాది వేడుకలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించనుంది. కాగా, అదే రోజున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఒక్కో జిల్లాకు రూ.10 లక్షలు కేటాయించింది. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
పండుగ రోజు పంచాంగ శ్రవణం, కవి సమ్మేళనం, పురస్కారాల ప్రదానం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. తెలుగువారు గర్వపడేలా వేడుకలు జరగాలని అధికారులను సీఎం సూచించారు. పండుగ రోజే పీ4 పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఏపీ అభివృద్ధిలో ప్రజలు డైరెక్టుగా భాగస్వాములు కానున్నారు.
Uttam Kumar Reddy: కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ విషయం మీకు తెలుసా!
తద్వారా అభివృద్ధి ఫలాలను ప్రజలు డైరెక్టుగా అందుకునే అవకాశాలు ఎక్కువ. ఒక రకంగా ఇది ప్రజలు పెట్టుబడి పెట్టే లాంటి అంశం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సంపదను పెంచుతామనీ, పేదరికాన్ని నిర్మూలిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. పండుగ రోజే చేనేత కార్మికులకు ఉగాది కానుకగా ఉచిత విద్యుత్ అమలుకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.