తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: MLA Sambasiva Rao: కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక ఎకరాను సాగు చేస్తే విద్యుత్ బిల్లులకే 40వేల ఖర్చు అవుతుందని, అందుకే ఆప్రాజెక్టును వదిలేయండి అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అసెంబ్లీలో ఆయన బుధవారం మాట్లాడారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు గ్రావిటీతో నీరందింస్తే ఎకరాకు 10వేలు మాత్రమే ఖర్చు అవుతుందని, దీంతో కాళేశ్వరం కంటే 30వేలు ఆదాఅవుతుందని తెలిపారు. పనికిరాని ప్రాజెక్టులను వదిలేసి గ్రావిటీ తో నీరందించే ఆలోచనను ప్రభుత్వం చేయాలని సూచించారు.
లాభనష్టాలపై సైతం బేరీజు వేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోలీసుశాఖలో రిఫార్మ్స్ రావాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసు ఎత్తేయాలనిడిమాండ్ చేశారు. పోడుభూములు సాగుచేసుకుంటున్న గిరిజనులపై సైతం నమోదు అయిన కేసులు తొలగించాలని కోరారు. లాఅండ్ఆర్డర్ పై విచారణ చేయాలని, రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నైజిరియా నుంచి డ్రగ్స్ రాకుండా అరికట్టాలన్నారు. మహిళలపైదాడులు జరుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
Also Read; CM Revanth Reddy: సీఎం రేవంత్ మజాకా? ఆ ఎమ్మెల్యేలు ఏకంగా ఆ దారే పట్టారే!
హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలన్నారు. లెప్టు భావాలు ఉన్నవారు.. సామాజిక స్పృహ ఉన్నవారిపై అర్బన్ నక్సల్స్ పేరుతో కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అలాంటి ఆలోచనను ప్రభుత్వం చేయవద్దని కోరారు. వరవరరావు తదితరులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 9లక్షల సాదాబైనామాలు పెండింగ్ లో ఉన్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని దీంతో లక్షలాదిమందికి మేలు జరుగుతుందన్నారు.
Also Read: BRS MLAs Walks Out: అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఫైర్.. దెబ్బకు విపక్ష పార్టీ వాకౌట్
వైఎస్ఆర్ కౌలు రైతులకు కార్డుఅలు ఇచ్చి భరోసా కల్పించారని, అదే మాదిరిగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరుతో పాటు నిర్మించినవి పంపిణీ చేయాలని కోరారు. జర్నలిస్టులకు స్పెషల్ పాలసీ తీసుకురావాలని, ఆరోగ్య, పెన్షన్, ఇళ్లు సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ను రద్దు చేయాలని, ఆర్టీజెన్స్ కార్మికులపై ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు. సింగరేణిలోని బొగ్గును ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించవద్దని కోరారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈలింక్ https://epaper.swetchadaily.com/ క్లిక్ చేయగలరు