CM Revanth Reddy (imagecredit:twitter)
Politics

CM Revanth Reddy: సీఎం రేవంత్ మజాకా? ఆ ఎమ్మెల్యేలు ఏకంగా ఆ దారే పట్టారే!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: CM Revanth Reddy: తెలంగాణ రాజకీయాల్లో వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్ట్రాంగ్ లీడర్ షిప్ ఇమేజ్‌ను మరింత బలపరచుకుంటున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో దూకుడుగా వ్యవహరించిన విపక్షం, ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ హాట్ సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఆయనపై నెగిటివ్ ప్రచారం చేసిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తో సహా మిగతా విపక్ష ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు రూట్ మార్చారు. సీఎంను కలిసేందుకు, ఆయన టైమ్ కోరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇన్నాళ్లూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగలేరు అంటూ నెగెటివ్ ప్రచారం చేసిన ప్రతిపక్షాలు తాజాగా ఆ దుకాణం సర్దేస్తున్నాయి. తాజా అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ వ్యూహాలకు ప్రతిపక్ష పార్టీలతో సహా, ఎమ్మెల్యేలు విలవిల్లాడుతున్నారు. ఆయన తన రాజకీయ వ్యూహాన్ని మరింత పదును పెట్టినట్లు ఈ సమావేశాలు నిరూపించారు. వేగంగా పాలనా పరమైన నిర్ణయాలకు తీసుకోవటంతో పాటు, రాజకీయ ఎత్తులు పై ఎత్తుల్లో రేవంత్ రెడ్డి గతంతో ప్రముఖ నేతలుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కేసీఆర్ లను మించి పోయారనే టాక్ ప్రస్తుతం నడుస్తోంది.

Aldo Read: Komatireddy Venkat Reddy: రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. బోనస్ కొనసాగింపు

నిన్నా మొన్నటి దాకా రేవంత్ రెడ్డి జాక్ పాట్ ముఖ్యమంత్రి అని జోక్ చేసిన విపక్ష నేతలు ఇప్పుడు తమాయించుకొంటున్నారు. ఇది అల్లా టప్పా వ్యవహారం కాదనే సంగతి వాళ్లకూ అర్థమైపోయింది. దీనికి తాజా ఉదహారణగా బీఆర్ఎస్ నేత హారీష్ రావు అసెంబ్లీలో ముఖ్యమంత్రితో ఏకాంత భేటీని ఉదహరిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ఏడాదికి పైగా కాలంలో రేవంత్ రెడ్డిని గుర్తించేందుకు, ఆయన సమర్థతను ఒప్పుకునేందుకు తటపటాయించిన నేతలకు ఇప్పుడు తత్వం బోధపడుతోంది. ఆయనతో వ్యవహారం అంత ఈజీకాదని వారికి అర్థం అవుతోందని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ప్రముఖ నేత అసెంబ్లీ సమావేశాల్లో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు.

చంద్రబాబు, వై.ఎస్, కేసీఆర్ ను మిక్సీలో వేస్తే వచ్చే ప్రోడక్ట్ రేవంత్ రెడ్డి అంటూ ఆయన సరదాగా కామెంట్ చేశారు. ఆయన అలా చెప్పినా వాస్తవం మాత్రం అందుకు దగ్గరగానే కనిపిస్తోంది. మొదటి యేడాదిలో పాలనను, పార్టీని, ఢిల్లీ వాళ్లను సెట్ రైట్ చేసేందుకు కొంత ఇబ్బందిపడ్డ రేవంత్ రెడ్డి, రెండో ఏడాది మొదట్లోనే గేర్ మార్చారు. ఆయన వేగం, తేజం కొంత డిఫరెంట్ గా ఉందని స్వయంగా విపక్ష నేతలే అంటున్నారు. ఉద్యోగాల కల్పన, పెట్టుబడులను రాబట్టడం, ఢిల్లీని కన్విస్స్ చేయటం, కులగణన, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీవర్గీకరణ, తాజాగా నియోజక వర్గాల పునర్విభజన ఇలా అన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి అల్ రౌండర్ అవతారం ఎత్తారు. అసెంబ్లీ బయటా లోపలా రాజకీయాలను చెడుగుడు ఆడుతున్నారు.

విపక్షంలో మారుతున్న వాతావరణం 

రేవంత్ రెడ్డి దూకుడుతో ఇంతకుముందు కఠినమైన విమర్శలు చేసిన విపక్ష ఎమ్మెల్యేలు, ఇప్పుడు తమ వైఖరిని తగ్గించడమే మంచిదని భావిస్తున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత రేవంత్, తన విధానాలను మరింత క్లియర్‌గా అమలు చేస్తున్నారు. ప్రగతి భవన్‌ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తేవడమే కాకుండా, ప్రతి సమస్యను ఎదుటివారినించే డైరెక్ట్ గా అడిగి తెలుసుకోవడం, అధికారులను వారి వైఖరి మార్చుకోవాల్సిందిగా హెచ్చరిస్తూనే, ఉరకలెత్తించడం వంటి చర్యలతో తన సత్తా చాటుతున్నారు.

దీంతో విపక్ష ఎమ్మెల్యేలు తమ పార్టీ లైన్ ఎలా ఉన్నా, తాము మాత్రం ముఖ్యమంత్రితో సర్దుకుపోవటమే మంచిదనే వైఖరికి వచ్చామని ఒక బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ ను ప్రసన్నం చేసుకోకపోతే పనులు కావని, ఇక ఎంతో కాలం కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని బద్ నాం చేస్తూమాట్లాడలేమని వారంటున్నారు. తమకు ఓటేసిన ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాలంటే ప్రభుత్వం వైపు నుంచి పనులు సాధించాలనే వైఖరిలో విపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారు.

రేవంత్ ఎదుగుదలకు విపక్ష సభ్యుల స్పందన

రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వేచి చూసే దూరంలో ఉన్నా , తాజాగా జరుగుతున్న కొన్ని నిర్ణయాలు విపక్ష నాయకులను మెత్తబడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా, ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎంతో నేరుగా భేటీ అవ్వడమే ఉత్తమం అని కొందరు భావిస్తున్నారు. గతంలో తీవ్ర విమర్శలు చేసిన నేతలే ఇప్పుడు సీఎంను కలిసి పనులు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. అందుకే వీలైతే ముఖ్యమంత్రితో స్పెషల్ దర్శనం మీటింగ్, లేదంటే దర్మదర్శనంలోనైనా అపాయింట్ మెంట్ ఇప్పించాలని తమకు పరిచయం ఉన్న లీడర్ నో, లేదంటే అధికారులని కోరుతున్నట్లు సమాచారం.

భవిష్యత్తు వ్యూహం ఏమిటి?

తాజాగా రాష్ట్రంలో పొలిటికల్ వ్యూహం మారుతోంది. ఇన్నాళ్లూ బలమైన నేత కేసీఆర్, ఆయనను రేవంత్ ఢీ కొంటారా అనే అనుమానాలు క్రమంగా అందరిలో పటాపంచలు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షానికి రెండు మార్గాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒకటి, మునుపటిలాగే గట్టిగా ఎదిరించడం, కానీ తాజా పరిస్థితుల్లో ఇది సాధ్యపడకపోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వ హవా, సీఎం స్పీడ్ ఇంకా బలంగా మారుతోంది. రెండో మార్గం, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి, ముఖ్యమంత్రికి చెప్పి వాటి పరిష్కారానికి సహకరించాని స్వయంగా ఆ ఎమ్మెల్యేలు కోరటమే వారి ముందున్నపరిష్కార మార్గం.

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో విపక్ష నేతలు, ఎమ్మెల్యేల వైఖరిలో స్పష్టమైన మార్పుకనిపిస్తోంది. ఆయన గట్టి పిండం, ఇక తమ ఆటలు సాగవు అనే విషయం వారికి బోధపడుతోంది. ముఖ్యమంత్రి వ్యూహాలు, స్పీడ్ ను తట్టుకోలేక ఆయనతో సర్థుకుపోవటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చిన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది.

Also Read: BRS 25th Anniversary: బీఆర్ఎస్ లో టెన్షన్ టెన్షన్.. ఆ ఇద్దరు నేతల గురించే అంతా చర్చ..

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?