Dogs Cry at Night Image Source (pexels)
లైఫ్‌స్టైల్

Dogs Cry at Night: కుక్కలు రాత్రిపూట ఎందుకు ఏడుస్తాయి.. ఇది శుభమా.. ? అశుభమా?

కుక్కలు ( Dogs)  అరవడం చాలా సహజం. ఇంటికి కొత్త వాళ్లు వచినప్పుడు లేక ఏవైనా వింత శబ్దాలు వినిపించినప్పుడు అవి మొరుగుతాయి. ఇతర కుక్కలు కనిపించినప్పుడు కూడా అవి పెద్దగా అరుస్తుంటాయి. అయితే, కొన్ని సార్లు కుక్కలు ఏడుస్తాయి. అవి ఇలా ఎందుకు చేస్తాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. దీని వెనుక సైన్స్ ( Science )  ఏం చెబుతుంది? జ్యోతిష్య నిపుణులు (Astrology )  ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

రాత్రి పూట కుక్కలు  అలా ఏడుస్తున్నాయంటే దాని అర్థం .. ఏదో నెగిటివ్ ఎనర్జీ తిరుగుతుందని జ్యోతిష్యులు కూడా చెబుతుంటారు. అవి, ఆ శక్తులను చూసినప్పుడే అలా మొరుగుతాయని అంటుంటారు. హిందూ శాస్త్రంలో కుక్కలు ఏడవడాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఇది రాబోయే అపాయం లేదా జరగబోయే కీడుకు సంకేతంగా చెబుతుంటారు. ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబ తగాదాలను కూడా సూచిస్తుంది.

అయితే, కుక్కలు ఒక్కోసారి పెద్ద పెద్దగా ఏడుస్తుంటాయి. ఇది విని కొందరు భయపడతారు. వాస్తవానికి అవి బాధతో, ఇబ్బంది పడుతున్నట్టు అర్ధం. మనుషుల్లా వాటికి నోరు ఉండదు కాబట్టి.. భరించలేని నొప్పి కలిగినప్పుడు అలా చేస్తాయని పెట్ డాక్టర్ చెబుతున్నారు. మన ఇళ్ళలో పెంచుకునే పెంపుడు కుక్కలు మనల్ని చూసి ఏడుస్తాయి. అవి మనల్ని ఆకర్షించడానికి చేస్తాయి. ఒక్కోసారి, ఇంట్లో ఉండే కుక్కలను పట్టించుకోకపోయినా అవి బాధతో అరుస్తాయి. సమయంలో మనుషులు వాటిని దగ్గరకు తీసుకునికాస్తా ప్రేమను చూపిస్తే అవి చాలా సంతోషపడతాయి.

Also Read: MAD Square Trailer: ” మ్యాడ్ స్క్వేర్ ” ట్రైల‌ర్‌ రిలీజ్.. ఈ సారి థియేటర్లో రచ్చ రచ్చే

కొన్ని సార్లు, కుక్కలు అరుస్తున్నాయని మనుషులు వాటిని వెంబడించి మరి, కర్రలను విసురుతుంటారు. ఇలాంటి సంఘటనలను మనం నిజ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఇటీవలే కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. రోడ్ మీద నడుస్తూ వెళ్తున్న వారిపై కూడా మొరగడం, వారిని భయపెట్టడం లాంటివి చేస్తున్నాయి. దీని వలన జనాలు బయటకు రావాలన్న కూడా భయపడుతున్నారు. మరి, కుక్కలు ఏడవడం వెనుక సైన్స్ ఏం చెబుతుందంటే..

మనుషులకు ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయో కుక్కలకు కూడా అలాగే ఉంటాయి. ఇలా గట్టిగా ఏడ్చి బాధ, కోపం, ఆవేదన వంటి వాటిని అలా చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఉదయంపూట కుక్కకు ప్రమాదం జరిగితే, రాత్రికి దాని నొప్పి తీవ్రత పెరుగుతుంది. దాంతో, అవి నొప్పిని తట్టుకోలేక కళ్ళలో నుంచి నీరు వచ్చే వరకు ఏడుస్తాయి. ఇవి మాత్రమే కాకుండా, కుక్కలకు ఆకలితో వేసినప్పుడు కూడా ఏడుస్తాయి. ఇంకోవైపు శీతాకాలంలో రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో తినడానికి ఏమీ దొరకప్పుడు, అవి ఆకలితోనే ఏడవడం మొదలు పెడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కుక్కలు ఎవరి ఇంటి ముందు ఏడిస్తే.. వారు చనిపోతారన్న మాటలన్నీ కట్టుకథలే. వీటికి ఎలాంటి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకవేళ, అలా జరిగితే కేవలం అది యాధృచ్ఛికం మాత్రమేనని పరిశోధకులు చెబుతున్నారు.

Just In

01

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..