Warangal Police Commissioner: నిజాయితీగా పని చేయండి.. గౌరవం పెంచండి.. పోలీస్ కమిషనర్
నార్త్ తెలంగాణ

Warangal Police Commissioner: నిజాయితీగా పని చేయండి.. గౌరవం పెంచండి.. పోలీస్ కమిషనర్

వరంగల్, స్వేచ్ఛ: Warangal Police Commissioner: పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపోందించేలా నిజాయితీగా పోలీస్‌ అధికారులు పనిచేయాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం తొలిసారి పలు పోలీస్‌ స్టేషన్‌లు సందర్శించారు. పోలీస్‌ కమిషనర్‌ ముందుగా స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. అనంతరం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సిసి కెమెరాల కంట్రోల్‌ రూంలోని సిసి కెమెరాల పనితీరు, స్టేషన్‌లోని రికార్డు గదులను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు.

స్టేషన్ల పనితీరుపై ఆరా
అనంతరం స్టేషన్‌లోని పలు రికార్డులను తనీఖీ చేయడంతో పాటు, స్టేషన్‌ పనీతీరుతో పాటు, స్టేషన్‌ పరిధిలో ఏలాంటి నేరాలు జరుగుతాయి, ఎంత మంది రౌడీ షీటర్లు వున్నారు, రోజు ప్రమాదాల సంఖ్య, పోలీస్‌ స్టేషన్‌ పరిధి, స్టేషన్‌ సిబ్బంది మొదలైన వివరాలను ఇన్స్‌స్పెక్టర్‌ సంతోష్‌ను పోలీస్‌ కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా నిజాయితీ పనిచేయాలని, ఫిర్యాదులుపై వేగంగా స్పందించాలని, ముఖ్యంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వరంగల్‌ భూపాలపట్నం ప్రధాన రోడ్డు మార్గం వుండటం ద్వారా ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తూ చర్యలు తీసుకోవాలని, నేరాల నియంత్రణలో నిరంతరం అప్రమత్తంగా వుండాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ వెంట ఈస్ట్‌జోన్‌ డిసిపి అంకిత్‌ కుమార్‌, ఏసిపి సతీష్‌బాబు పాల్గోన్నారు.

కంఠాత్మకూర్‌లో పోలీస్‌ చెక్‌పోస్ట్‌ను సందర్శించిన సిపి
అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేసేందుకు ఆత్మకూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కంఠాత్మకూర్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పోలీస్‌ చెక్‌ పోస్టును వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ డిసిపి అంకిత్‌కుమార్‌తో కలిసి మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా చెక్‌పోస్టులో విధులు సిబ్బంది వివారాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, రోజు మొత్తం మీద ఎన్ని వాహనాలు తనిఖీ చేస్తారు. అలాగే అనుమతులు వున్న ఇసుక వాహనాలను ఏవిధంగా తనిఖీలు నిర్వహిస్తారని చెక్‌పోస్ట్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం చెక్‌పోస్టు సిబ్బంది తనిఖీ తీరును సిపి ఎదుట ప్రత్యక్షంగా ప్రదర్శించారు.

Also read: Minister Sridhar Babu: క్యాన్సర్ పేషెంట్ కోరిక.. కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి

దామెర పోలీస్‌ స్టేషన్‌ ఆకస్మిక తనిఖీ చేసిన వరంగల్‌ సీపీ
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ దామెర పోలీస్‌ స్టేషన్‌‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ సంబంధించిన రికార్డులను, పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించడం, స్టేషన్‌ నందు విధులు సిబ్బంది వివరాలతో పాటు, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అధికంగా ఎలాంటి నేరాలకు సంబంధించి కేసులు నమోదవుతాయని, ఎలాంటి గొడవలు అధికంగా జరుగుతాయి, ఎంత మంది రౌడీ షీటర్లు వున్నారు, వారిని ఎలా వారిని తనిఖీ చేసారు, అలాగే స్టేషన్‌ అధికారి రోజువారి వివరాలను పోలీస్‌ కమిషనర్‌ అడిగి తెలుసుకున్నారు.

Also read: Diagnostics Centre Narsampet: పేరుకే పెద్ద డయాగ్నస్టిక్..! పరీక్షలు ఉత్త మాటే..!

రౌడీ షీటర్లపై ఓ లుక్కేయండి
అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ నెలకోసారి తప్పనిసరిగా స్టేషన్‌ అధికారి తప్పని సరిగా రౌడీ షీటర్లతో పాటు అనుమానిత వ్యక్తుల ఇండ్లను సందర్శించి వారి స్థితిగతులపై చుట్టు ప్రక్కల వారిని ద్వారా ఆరా తీయాలని, మత్తు పదార్థాలు, సైబర్‌ నేరాలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, పోలీస్‌ స్టేషన్‌ వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ అధికారికి సూచించారు. పోలీస్‌ కమిషనర్‌ వెంట ఈస్ట్‌జోన్‌ డిసిపి అంకిత్‌కుమార్‌, ఏఎస్పీ ప్రస్తుతం దామెర స్టేషన్‌ ఎస్‌.హెచ్‌.ఓ ఏ.ఏస్పీ మనన్‌భట్‌, పరకాల ఏసిపి సతీష్‌బాబు వున్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..