Bengaluru Students: ఆ లెక్చరర్ కు ఆ రోజే చివరి వర్కింగ్ డే. కళాశాలను వీడుతున్నానన్న బాధతో ఉదయం నుండి ముభావంగా ఉన్నారు. ఏ విద్యార్థి పలకరించడం లేదు.. ఏ లెక్చరర్ మాట్లాడడం లేదు. అసలేం జరుగుతోంది తెలియని పరిస్థితి. చివరకు ఆ లెక్చరర్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు అందరూ.. దీనితో లెక్చరర్ కన్నీళ్లతో ఇంటికి పయనమయ్యారు. అసలేం జరిగిందంటే..
ఉపాధ్యాయుడు.. గురువు.. ఇలా ఎన్నో పదాలు పలికినా దాని అర్థం ఒక్కటే. ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉండాల్సిందే. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువు లేకుండా మనం ఉన్నత లక్ష్యాలకు చేరడం అసాధ్యమే. అందుకే గురువును పూజించాలి.. గౌరవించాలి అంటారు. ఎందరో శిష్యులు నేటికీ ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తమ గురువు సేవలో తరిస్తుంటారు.
అలాగే పాఠమే పాటగా.. చదువే ఒక ఆటగా.. గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా.. మనసును మురిపిస్తే.. బాధను మరిపిస్తే.. తరగతి గదులే.. రేపటి తరగని నిధులు అనే గేయం గురువు విలువతో పాటు, మన తరగతి గది విలువను తెలుపుతుంది. అందుకే గురువును గౌరవించడం మన విధి.. మన భాద్యత. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగింది బెంగుళూరులో..
అసలేం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన క్రైస్ట్ విశ్వవిద్యాలయంలో ఓ లెక్చరర్ అదే రోజు పదవీ విరమణ చేయనున్నారు. ఉదయం పాఠశాలకు వచ్చారు. తనను తన విద్యార్థులు పలకరించి వీడ్కోలు పలుకుతారని ఆయన భావించారు. అంతేకాదు మంచి లెక్చరర్ గా పేరున్న ఆయనను ఏ విద్యార్థి పలకరించకపోవడంతో ఆయన కూడా సైలెంట్ అయ్యారు. ఏం జరుగుతుందో అంటూ ఆందోళనలో మాత్రం ఆయన ఉన్నారు. అందుకు ప్రధాన కారణం, రోజువారీ మాదిరిగా విద్యార్థులు ఎవరూ తనతో మాట్లాడక పోవడమే.
ఇంతలోనే ఓ తరగతి నుండి అరుపులు, కేకలు వినిపించాయి. పరుగులు పెట్టి ఆ లెక్చరర్ అక్కడికి వెళ్లారు. విద్యార్థులు అందరూ పోట్లాడుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు చొక్కా కాలర్లు పట్టుకొని తెగ ఘర్షణ పడుతున్నారు. ఈ లెక్చరర్ మాత్రం వారిని సముదాయిస్తున్నారు. అంతలోనే కళాశాల విద్యార్థులందరూ అక్కడికి చేరుకున్నారు. ఒక్కసారిగా ఆ లెక్చరర్ ను గట్టిగా పట్టుకొని అభినందనలు తెలుపుతూ.. తెగ సందడి చేశారు. సిద్దంగా ఉంచిన కేక్ తెచ్చారు. మిఠాయిలు తెచ్చి ముందు ఉంచారు. ఒక్క క్షణంలో అక్కడంతా పండుగ వాతావరణం ఏర్పడింది.
Also Read: Anantapur News: ఏపీలో అద్భుతం.. ఆ యువకుడి మాటే నిజమైందా?
ఆ మాస్టర్ కు ఆశ్చర్యాన్ని కలిగించేందుకు విద్యార్థులు చేసిన ప్రయత్నం సఫలమైంది. మాస్టర్ తెగ సంబరపడ్డారు. విద్యార్థులందరినీ ఆశీర్వదించారు. తన జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆ తర్వాత తోటి మాస్టర్స్ తో మాట్లాడారు. తనకు ఇలాంటి వింత అనుభూతిని అందించిన విద్యార్థులకు థ్యాంక్స్ చెప్పిన మాస్టర్.. కన్నీళ్లతో ఇంటి దారి పట్టారు. ఇదంతా ఆ విశ్వవిద్యాలయం విద్యార్థిని మూసీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది క్షణాల్లో మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. కళాశాలలో చివరి రోజున విద్యార్థులు తమ తరగతి లెక్చరర్ కు వింత అనుభూతినిచ్చి, మంచిగా సెలబ్రేట్ చేశారని నెటిజన్స్ విద్యార్థులను అభినందిస్తున్నారు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి