yuvraj singh warning to Abhishek Sharma SRH Star Carves Match Winning IPL 2024 Vs Csk
స్పోర్ట్స్

IPL 2024 : అభిషేక్‌ శర్మపై టీమిండియా మాజీ ప్లేయర్‌ ఫైర్

yuvraj singh warning to Abhishek Sharma SRH Star Carves Match Winning IPL 2024 Vs Csk: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మపై టీమిండియా మాజీ ప్లేయర్‌ యువరాజ్‌ సింగ్‌ మరోసారి ఫైర్ అయ్యాడు. గతంలో అభిషేక్‌కు చెప్పు చూపి బెదిరించిన యువీ..ఈసారి ఏకంగా నీకు బడిత పూజ తప్పదన్నట్లుగా ఓ మీమ్‌ని షేర్‌ చేశాడు. కాగా ఐపీఎల్‌ 2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన అభిషేక్. 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ ఓపెనర్‌ అదిరిపోయే ఓపెనింగ్‌ ఇచ్చాడు.సీఎస్‌కే బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 12 బంతుల్లో 37 రన్స్ చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లతో పాటు ఏకంగా నాలుగు సిక్సర్లు ఉండటం మరో విశేషం.

స్ట్రైక్‌ రేటు ఏకంగా 308.33 అయితే అతడి అభిషేక్‌ బ్యాటింగ్‌ మెరుపులు ఇంకాసేపు అలానే చూడాలని భావించిన ఫ్యాన్స్‌ ఆశలపై దీపక్‌ చహర్‌, రవీంద్ర జడేజా నీళ్లు చల్లారు.రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో చహర్‌ వేసిన నాలుగో బంతి అవుట్‌ ఆఫ్‌ దిశగా వైడ్‌ వెళ్తుండగా అభిషేక్‌ షాట్‌ ఆడేందుకు ట్రై చేశాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ మీదుగా బంతిని కొట్టగా ఫీల్డర్‌ జడ్డూ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా అభిషేక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

Also Read: సన్‌రైజర్స్‌ సెకండ్ విక్టరీ 

ఏదేమైనా ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అభిషేక్‌ శర్మను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురిపిస్తూనే చిరుకోపం ప్రదర్శించాడు యువీ.నేను ఎల్లప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాను బాబూ.. మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడావు. అయితే ఈసారి కూడా చెత్త షాట్‌ సెలక్షన్‌కు అవుటయ్యావంటూ ఓ వ్యక్తి కర్ర లాంటి వస్తువుతో మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న హిలేరియస్‌ మీమ్‌ ఒకటి షేర్‌ చేశాడు.

యువీ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌ శర్మ యువీకి వీరాభిమాని. ఇక అభిషేక్‌కు యువరాజ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం అభిషేక్‌ మాట్లాడుతూ యువీ పాజీ ధన్యవాదాలు అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ ఈ మేరకు స్పందించడం గమనార్హం.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!