తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: SLBC tunnel – CM Revanth Reddy: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఫిబ్రవరిలో జరిగిన ప్రమాదం అనంతరం కొనసాగుతున్న సహాయక చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్‌లో సోమవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఇకపైన కూడా ఈ చర్యలు కంటిన్యూ కావాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్‌ను పర్యవేక్షణ కోసం నియమిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో ఒకరు చనిపోయినట్లు నిర్ధారణ కాగా మిగిలిన ఏడుగురిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్లను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు.
Also Read: Group 1 Revaluation: గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలపై హైకోర్టు నోటీసులు.. తెరపైకి కొత్త వివాదం! u
ప్రస్తుతం 25 ఏజెన్సీలకు చెందిన దాదాపు 700 మంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు అవసరమైతే సంప్రదించి తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సహాయక చర్యలకు సంబంధించి ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సింగరేణి తదితర విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. నెల రోజులుగా ప్రమాద స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిపై రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా వివరించారు.
Also Read: Hyderabad Crime: చదివేది బీటెక్.. చేసేది గంజాయి దందా.. చివరకు
సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను బయటకు తీస్తున్నామని, ఎప్పటికప్పుడు పేరుకుపోయిన మట్టి, రాళ్ల దిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలిగిస్తున్నట్లు తెలిపారు. టన్నెల్ ఇన్‌లెట్ నుంచి 14 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగినందున గాలి, వెలుతురు తక్కువగా ఉన్నదని, సహాయక చర్యలకు ఇది ఆటంకంగా మారిందని, క్లిష్టమైన పరిస్థితుల్లోనే కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో 30 మీటర్ల మేర అత్యంత ప్రమాదకర జోన్‌గా గుర్తించినట్లు వివరించారు. జీఎస్ఐ (జియోలాజికల్ సర్వే), ఎన్జీఆర్ఐ (నేషనల్ జియోలాజికల్ రీసెర్చి) శాస్త్రీయ అధ్యయనాల ప్రకారమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వారు వెలిబుచ్చారు. ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
Also Read: Ramulu Naik on KCR: కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. అదేంటి అంతమాట అనేశారు!
ఆపద సమయంలో చేపట్టాల్సిన అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులనూ తీసుకోవాలని ఆదేశించారు. గల్లంతైన ఏడుగురు కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్‌ను కొనసాగించాలని, అన్ని రకాల ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచించారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు పనులు కొనసాగించాలన్నారు.
ఈ సమావేశంలో సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ, ఆంధ్రా సబ్ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ అజయ్ మిశ్రా (ఆర్మీ), ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, సింగరేణి, హైడ్రా, ఫైర్ సర్వీసెస్ ప్రతినిధులు, ఎస్ఎల్బీసీ పనులు చేపడుతున్న కాంట్రాక్టు కంపెనీ ఎండీ పంకజ్ గౌర్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు