తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: BRS 25th Anniversary: గులాబీ కేడర్ కన్ప్యూజ్ లో పడుతుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీలోని ఇద్దరు కీలక నేతలు ఎవరికి వారుగా ప్రోగ్రాంలు చేపడుతున్నారు. ఇద్దరు వేడుకలకు కేడర్ ను సిద్ధం చేస్తున్నప్పటికీ ఒకే సమావేశంలో పాల్గొనకపోతుండటం చర్చకు దారితీసింది. ఎందుకు వేర్వురుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు? ఇద్దరు కలిసి పోతే అభ్యంతరం ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు పార్టీలో ఏం జరుగుతుంది… అధికారం కోల్పోయినా ఇంకా మార్పురాలేదా? అనే ప్రశ్న ప్రజల్లో సైతం ఉత్పన్నమవుతోంది.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతుంది. ఏప్రిల్ 27న వరంగల్ లో భారీ బహిరంగసభకు సన్నద్ధమవుతుంది. అందుకోసం ఏర్పాటు చేయాలని ఉత్సవాలకు ఇన్ చార్జీగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన వరంగల్ శివారులోని దేవన్నపేట,కోమటిపల్లిలో సభ నిర్వహణ పరిసరాలను పరిశీలించారు. సభకు జనసమీకరణ ఎలా చేయాలి? ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలి? కోఆర్డినేషన్ పై దృష్టిసారించారు. కమిటీలపైనా పార్టీ అధినేత కేసీఆర్ సైతం, సభా సక్సెస్ పైనా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సభా స్థలిని నేతలతో కలిసి చూశారు. అయితే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అధినేత త్వరలోనే కమిటీ వేస్తారని ప్రకటించారు. కేసీఆర్ హరీష్ రావును ప్రకటించినట్లు ఎక్కడా ప్రకటించలేదు. కానీ హరీష్ రావు మాత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలకు మాత్రం జనసమీకరణపై దృష్టిసారించి ఆ దిశగా ముందుకు సాగుతున్నారు.
Also read: BJP: తెలంగాణ బీజేపీకి తప్పని రథ‘సారధి’ తిప్పలు.. పగ్గాలు ఎవరికో?
మరోవైపు పార్టీ ఆవిర్భావ వేడుకల విజయవంతానికి జిల్లాల వారీగా కార్యకర్తల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వంపై తనదైన శైలీలో విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కీలక నేతలందరికీ సమావేశానికి ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ఆవిర్భవించిన సందర్భం నుంచి తెలంగాణకోసం పోరాట పటిమ, రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన తీరును కేటీఆర్ వివరిస్తూ వారిని కేడర్ లో జోష్ నింపేప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో వైఫల్యాలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు, రైతు, మహిళ, యువత, విద్యార్థి, కార్మికులు ఇలా అన్ని రంగాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ కేడ ను యాక్టీవ్ చేసేందుకు ముందుకు సాగుతున్నారు.
Also read: Sanjay on KCR: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.. పెద్ద బాంబే పేల్చారు
పార్టీలో కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కీలక నేతలు. అయితే సిల్వర్ జూబ్లీ విజయవంతానికి నిర్వహించే సన్నాహక సమావేశాలు మాత్రం జిల్లాల వారీగా కేటీఆర్ ఒక్కరే నిర్వహిస్తుండటం, హరీష్ రావు పాల్గొనకపోవడం హాట్ టాపిక్ గా మారింది. హరీష్ రావుకు సభ విజయవంతానికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ చెప్పినప్పటికీ ఇద్దరు కేడర్ సన్నాహక సమావేశాల్లో వేదికపై ఉండటకపోవడం ఏంటనేది పార్టీ కేడర్ చర్చించుకుంటున్నారు. ఎందుకు కలిసి సమావేశాలు నిర్వహించడం లేదు… ఇద్దరు చెరో వైపు సాగుతూ కేడర్ ను సభకు సమాయత్తం చేస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయినప్పటికీ ఇద్దరు మధ్య సయోధ్య లేదని, అందుకే ఎవరికి వారుగా సాగుతున్నారని, సొంతంగా కేడర్ ను తయారు చేసుకుంటున్నారనేది ప్రచారం జరుగుతుంది. పార్టీతో పాటు ప్రజల్లోనూ బలమైన నాయకుడిగా పేరుతెచ్చుకోవాలనే ప్రయత్నం ఇద్దరు చేస్తున్నారనే ప్రచారం మరోవైపు సాగుతుంది.
Also read: KTR Comments: కేసీఆర్ మంచివారే.. నేను కాదు.. కేటీఆర్
పార్టీ సభ పేరుతో ఇద్దరు నేతలు బలనిరూపణకు సిద్ధమవుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. అందుకే కేటీఆర్ దక్షిణ తెలంగాణపై దృష్టిసారించారనే ప్రచారం జరుగుతుంది. గతంలో రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా దక్షిణ తెలంగాణ బాధ్యతలు హరీష్ రావు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అయితే ప్రస్తుతం కేటీఆర్ పర్యటనలకు శ్రీకారం చుట్టడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. హరీష్ రావు ఇంకా సన్నాహక సభలకు శ్రీకారం చుట్టలేదు. సభకు కమిటీలు వేయలేదు. పార్టీ ఆవిర్భావ వేడుకలకు గడువు సమీపిస్తున్నప్పటికీ హరీష్ రావు కేవలం వరంగల్ కు మాత్రమే వెళ్లి వచ్చారు. ఈ తరుణంలో ఉత్తర తెలంగాణకు హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తారా? అనే చర్చ జరుగుతుంది. అయితే ఇరువురు సభకు ఎక్కువగా జనాన్ని తరలించి నాకంటే..నాకు ప్రజల్లో ఆదరణ ఉందని చూపించుకోవాలనే ప్రయత్నం జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరు ఎక్కువగా జనసమీకరణ చేసి సత్తా చాటుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also read: GHMC Fine: రోడ్డుపై చెత్త వేస్తున్నారా జాగ్రత్త.. ఇకపై జేబులకు చిల్లులే
ఇదెలా ఉంటే హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసిపోతేనే కేడర్ లో సైతం జోష్ నెలకొంటుందని, పార్టీ సన్నాహక సమావేశాల్లోనూ ఇద్దరు వేదికపై ఉంటేనే నాయకులకు సైతం భరోసా కలుగుతుందని పలువురుఅభిప్రాయపడుతున్నారు. వేరువేర్వుగా పోతే పార్టీకేడర్ తో పాటు ఇతర పార్టీ నేతలకు సైతం విమర్శలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని, పార్టీలోనూ వర్గ విభేదాలు వస్తాయని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అయితే మరి ఇద్దరు కలిసి పోతారా? లేకుంటే ఎవరికి వారుగా వెళ్తారా? అని చూడాలి. ఈ వరంగల్ సభ మాత్రం పార్టీకి , కేడర్ కు బూస్టు ఇవ్వనుంది.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/