తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Economic Survey TG: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ ప్లానింగ్ లో భాగంగా 1,35,713 మంది కండోమ్ లు వినియోగిస్తున్నట్లు సోషియో ఎకానమీ సర్వేలో పేర్కొన్నారు. దీంతో పాటు మరో 1,10,016 మంది పిల్స్ వినియోగించారు. అంతేగాక మరో 13,676 మంది అంత్రా ఇంజక్షన్స్ వాడగా, 67,464 మంది మహిళలు ట్యూబెక్టమీ, 1006 మంది పురుషులకు వ్యాసెక్టమీ స్టెరిలైజేషన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. 2024–2025 లో ఫ్యామిలీ ప్లానింగ్ గణాంకాలను ప్రభుత్వం సోషియో ఎకానమీ బుక్ లెట్ లో పొందుపరిచింది.
దేశ వ్యాప్తంగా గతంలో ప్రవేశ పెట్టిన ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలు సౌత్ స్టేట్స్ లో సంపూర్ణంగా అమలవుతుండగా, తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉండటం గమనార్హం. ఇటీవల నేషనల్ హెల్త్ సెమినార్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. ఆ సదస్సులో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కంట్రోల్, ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలపై ప్రశంసలు లభించినట్లు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
Also read: Viral: ఐపీఎల్ ఎఫెక్ట్.. ఉద్యోగమే ఊడింది.. మరీ ఇంత పిచ్చా!
క్షేత్రస్థాయిలోనే కట్టడి..?
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ పద్ధతులపై వైద్యారోగ్యశాఖ గ్రౌండ్ లెవల్ స్టాఫ్ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నది. వారంలో ఒక రోజు ప్రాథమిక ఆరోగ్య స్థాయి కేంద్రం పరిధిలోని జంటలకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఎంత మంది పిల్లల్ని కనాలి? ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? ఫస్ట్ బేబీ నుంచి సెకండ్ బేబీ గ్యాప్ ఎంత ఉండాలి? పునరుత్పత్తి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గ్రామాల పరిధిలోని ఎమ్ ఎల్ హెచ్ పీలు, ఆశాలు, ఏఎన్ ఎంలు చొరవ తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల మంది ఏఎన్ ఎంలు, 37 వేల మంది ఆశా వర్కర్లు కుటుంబ నియంత్రణపై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సమర్ధవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
Also read: Warangal News: కడుపులో ఉండగానే.. చంపేస్తున్నారు.. చర్యలుంటాయా? ఉండవా?
కుటుంబ సభ్యుల సమ్మితంతోనే…
ఇక పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ప్లానింగ్ జంటలకు మెడికల్ ఆఫీసర్ స్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రెండు మూడు దఫాల చర్చలు అనంతరం, కుటుంబ సభ్యుల సమ్మతంతో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ సర్జరీలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందిన స్టాఫ్ తో సర్జరీలు చేయిస్తున్నారు. గతంలో పోల్చితే క్వాలిటీ థియేటర్లను వినియోగిస్తున్నారు. సర్జరీలు సమయంలో సరైన జాగ్రత్తలు పాటించని యెడల ఇన్ ఫెక్షన్ లు ప్రబలి ప్రాణప్రాయ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉన్నది. గతంలో కొన్ని దవాఖాన్లలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి.
Sangareddy News: ప్రియుడి కోసం భర్త హత్యకు ప్లాన్.. బెడిసికొట్టి భార్య జైలుకు
తగ్గిన టీ ఎఫ్ ఆర్…?
రాష్ట్రంలో అమలు చేస్తున్న పాలసీలు, నిర్ణయాలు వలన టోటల్ ఫెర్టిలిటి రేట్(టీఎఫ్ఆర్ తగ్గినట్లు సోషియో ఎకనామీ సర్వేలో వెల్లడించారు. ఒక మహిళ తన జీవిత కాలంలో ఎంత మంది పిల్లల్ని కంటున్నారనేది టీఎఫ్ఆర్ లో లెక్కిస్తారు. జాతీయ స్థాయిలో టీఎఫ్ఆర్ 2.0 ఉండగా, తెలంగాణ లో 1.5 ఉన్నట్లు శాంపిల్ రీసెర్చ్ సర్వే 2020 రిపోర్టు ప్రకారం వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరగడం, హెల్త్ ప్రోగ్రామ్ లు సంపూర్ణంగా చేయడంతోనే ఇది సాధ్యమైనట్లు సోషియో ఎకానమీ సర్వేలో పేర్కొన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/