Sanjay on KCR:
తెలంగాణ

Sanjay on KCR: కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన ఆరోపణలు.. పెద్ద బాంబే పేల్చారు

Sanjay on KCR: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు బీదర్ లో దొంగనోట్లు ముద్రించే ప్రెస్ ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఆ విషయాన్ని తనతో ఢిల్లీకి చెందిన ఓ పోలీసాఫీసర్ చెప్పారని ఆయన తెలిపారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ కు ఓ ప్రైవేటు ప్రెస్ ఉందని ఆరోపించిన కేంద్ర మంత్రి.. తెలంగాణల ఉద్యమంలో దొంగనోట్లు పంచారన్నారు. ఉద్యమ సమయంలో దొంగనోట్ల వ్యాపారం చేసేవారని బాంబ్ పేల్చారు. ఎన్నికల్లో కూడ బీఆర్ఎస్ దొంగనోట్లు పంచిందని ఆరోపించారు. గత ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల అప్పు చేసిందని, బీఆర్ఎస్ నిర్వాకం వల్ల ప్రస్తుతం భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇవ్వవలసిన దుస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

KCR: జగన్ దారిలో కేసీఆర్.. చివరికి అదే జరిగేనా?

అయితే.. కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తాజాగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఓ సంఘటన గుర్తొస్తుంది. కేసీఆర్ హయాంలో రాజకీయాలు ఢీ అంటే ఢీ అనే విధంగా ఉండేవి. ఓ పక్క కాంగ్రెస్ తరఫున అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కు ఎదురొడ్డుతుంటే.. మరోవైపు బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అదే స్థాయిలో బీఆర్ఎస్ నాయకత్వంపై తిరుగుబాటు చేసేవారు. కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్లు చాలా సందర్భాల్లో జరిగేవి.

అప్పటి కేసీఆర్ వ్యాఖ్యలకి.. సంజయ్ ఆరోపణలకు లింకూ?

ఈ క్రమంలో.. ఇంకో కొద్ది నెలల్లో ఎన్నికలు వస్తాయనగా అప్పట్లో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో థర్ఢ్ ఫ్రంట్ అంటూ కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఉండాలంటూ కేసీఆర్ దేశ నేతలను కలిసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన..‘‘ప్రధాని మోదీని కేంద్రంలో గద్దె దించుదాం.. దానికి ఎంత డబ్బు కావాలన్న నేను చూసుకుంటా’’ అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దేశంలోనే ప్రముఖ జర్నలిస్ట్ ఒకరు ఈ విషయాన్ని బయటపెట్టారు. దాంతో అప్పుడు పెద్ద దుమారమే రేగింది. దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశం అయింది. నేషనల్ మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయి.

దానికి ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు లింక్ ఏంటి.. అనుకుంటున్నారా? ఆ సమయంలో దేశవ్యాప్తంగా కేసీఆర్ కామెంట్స్ పై తీవ్ర చర్చ జరిగింది. కేసీఆర్ వద్ద అంత డబ్బుందా? ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయా? ఎంత డబ్బైనా ఖర్చు పెడతారా?, కేసీఆర్ అంతలా అవినీతికి పాల్పడ్డారా? అంటూ అంతటా డిస్కషన్ నడిచింది. సరిగ్గా సమయంలో తెలంగాణలో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అయింది. అందులో బండి సంజయ్ హస్తం కూడా ఉందన్న ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే తన వద్ద వేల కోట్ల రూపాయల ధనం ఉందన్న ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న వేళ ఆ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికే కేసీఆర్ ఆనాడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన దొంగ నోట్ల ప్రెస్ అంశం దానికి కరెక్టు గా లింకు అవుతున్నట్లు ఉంది.
కాగా, బండి సంజయ్ వ్యాఖ్యలపై కేసీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు ఎలా రియాక్ట్ అవుతాయన్నది చూడాలి.

Also Read: Posani Krishna Murali: పోసాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? న్యూటర్న్ ఖాయమేనా?

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?