వరంగల్, స్వేచ్ఛ: Warangal News: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని చైన్‌స్నాచర్లు చేస్తున్న ముగ్గురిని, దొంగ తనానికి పాల్పడ్డ మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టులకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వివరాలను వెల్లడించారు.
హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ కోటకు చెందిన చాపర్తి రాజేష్ (30) ఇస్త్రీ షాపు నిర్వహిస్తూ దీని ద్వారా వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు, చైన్ స్నాచింగ్ ద్వారా డబ్బు సులభంగా సంపాదించాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈ నెల 11న హనుమకొండ రెడ్డి కాలనీలో ఒంటరిగా వెళ్ళుతున్న ఓ మహిళ మెడలో వున్న రెండున్నర తులాల బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వెళుతూ బలవంతంగా లాక్కోని తప్పించుకొని పోయాడు.
Also read: Bandi Sanjay – Raja Singh: రాజా సింగ్ vs బండి సంజయ్.. అధ్యక్ష పీఠంపై డైలాగ్ వార్!
ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు, సిసిఎస్ పోలీసులతో కలిసి దర్యాప్తు చేసి ప్రస్తుతం పోలీసుల వద్ద వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని పోలీసులు ఈ రోజు ఉదయం పెద్దమ్మగడ్డ ప్రాంతంలో అరెస్టు చేసి విచారించగా నిందితుడు గతంలో ఇదే తరహాలో నాలుగు చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డాడు. నిందితుడి నుండి సిసిఎస్ పోలీసులు రూ.4లక్షల 75వేల రూపాయల విలువ గల బంగారం, పది వేల రూపాయల నగదు, ఒక ద్విచక్రవాహనం, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో చైన్ స్నాచింగ్ కేసు
చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఐనవోలు గోకుల్‌నగర్‌లో నివాసం ఉండే హనుమకొండకు చెందిన తాళ్ళపల్లి సంపత్ కుమార్(39), నడికూడకు చెందిన మరో నిందితడు చుక్క మురళీ(26)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన సంపత్‌కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ, వచ్చిన డబ్బులతో బెట్టింగ్ యాప్‌ల ద్వారా బెట్టింగ్ కాసి డబ్బులు నష్టపోయి ఆటో రుణానికి సంబంధించి నెలసరి వాయిదాలు కట్టకపోవడం సులభంగా డబ్బు సంపాదించాలను కున్నాడు. ఈ కేసులోని మరో నిందితుడు ఇచ్చిన సలహా మేరకు ఈ ఇద్దరు నిందితులు నిన్నటి రోజున కిరాణ షాపులో బిస్కెట్ ప్యాకెట్ కొనుగోలు చేస్తున్నట్లుగా నటిస్తూ సదరు కిరణాం షాపు యజమానురాలి మెడలోని రోల్డ్‌గోల్డ్ గొలుసును లాక్కోని అక్కడి నుండి ఆటోలో పారిపోయారు.
Also read: Jupally Krishna Rao: పర్యాటకంలో కొత్త లక్ష్యాలు.. చేరుకుంటే దశ మారినట్లే!
ఈ ఘటనపై కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టి నేరం జరిగిన ఇరువై నాలుగ గంటలోపే నిందితులను ఈరోజు ఉదయం ఫాతిమా సెంటర్‌లో అరెస్టు చేసి వీరి నుండి రోల్డ్‌గోల్డ్ గోలుసుకున్న సూమారు 15వేల రూపాయల విలువ గల 2.750 గ్రాముల బంగారంతో పాటు ఒక ఆటో, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో జరిగిన చోరీ
కర్నాటక రాష్ట్రం, ప్రస్తుతం వనస్థలి పురం నివాసం వుంటున్న నిందితుడు కార్తీక్ (35) అనే నిందితుడు గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్‌కు హోటళ్ళ వ్యాపారం నిర్వహించే చెందిన స్వాతి కిరణ్ వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. నిండితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. సులభంగా సంపాదించాలనుకున్న నిందితడు ఆవకాశం కోసం ఎదురు చూసాడు. ఇంతలో కారు యాజమాని తన వ్యాపార భాగస్వామి గూడమల్ల వినయ్‌కుమార్ కలిసి కారులో ఈ నెల 18వ తేదిన కాజీపేటకు చేరుకోని ఇక్కడే హొటల్ వ్యాపారం లావాదేవీల సంబంధించి 8లక్షల డబ్బు బ్యాగును తీసుకున్న బాధితుడు వినయ్‌కుమార్ డబ్బు బ్యాగును తాను ప్రయాణిస్తున్న కారులో వెనుక భాగంలో భద్రపర్చాడు.
Also read: Telangana Bhavan: దేశరాజధానిలో తెలంగాణ మార్క్.. కసరత్తులు షురూ
సూమారు రాత్రి 9గంటలకు భీమారంలో ఒక హోటల్‌లో రూం సేదతీరిన వ్యాపారస్తులు నిందితుడైన కారు డ్రైవర్ భోజనానికి వెళ్ళూతున్నట్లు వెళ్ళి కారులో వ్యాపారస్తులు భద్రపర్చిన ఎనిమిది లక్షల రూపాయల బ్యాగ్‌ను దొంగలించి అక్కడి నుండి పారిపోయినాడు. ఈ సంఘటనపై వ్యాపాస్తులు ఇచ్చిన ఫిర్యాదు అధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కేయూసి ఇన్స్ స్పెక్టర్ రవికుమార్.
టెక్నాలజీని వినియోగించుకోని ఈ రోజు ఉదయం హైదరాబాద్ వనస్థలిపురంలో నిందితుడుని అరెస్టు చేసి అతని వద్ద వున్న రూ.8లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మూడు సంఘటనల్లో నిందితులను పట్టుకొవడం ప్రతిభ కనబరిచిన క్రైమ్స్ డిసిపి జనార్థన్, సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా,ఏసిపిలు మధుసూదన్,దేవేందర్ రెడ్డి, నందిరాంనాయక్, తిరమల్ ఇన్స్‌స్పెక్టర్లు బాలాజీ, సతీష్, రవికుమార్, సుధాకర్ రెడ్డి ఏఏఓ సల్మాన్‌పాషాతో పాటు సిసిఎస్, టాస్క్‌ఫోర్స్, హన్మకొండ, మట్వాడా,కాజీపేట పోలీస్ స్టేషన్లకు చెందిన ఎస్.ఐలు, సిబ్బంది పోలీస్ కమిషనర్ అభినందించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/