Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజిని అంటే తెలియని వారుండరు. ఆమె రాజకీయం జీవితం అందరికీ తెలిసిందే. అయితే రజినిలో ఇటీవల భయం కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారంలో ఉన్న సమయంలో మీడియాకు దూరంగా ఉండే రజిని, ఇటీవల తన ఊసు అలా వస్తేనే చాలు.. భయపెట్టాలని చూస్తారా అంటూ స్పందిస్తున్నారు. తాజాగా రజినిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, సేమ్ టు సేమ్ అదే రిపీట్ చేశారు రజిని.
చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన రజిని ముందు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టిడిపి మహానాడులో ఆమె మాట్లాడిన మాటలు నేటికీ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఏం జరిగిందో ఏమో కానీ, రజినీ ఎవరూ ఊహించని స్థాయిలో వైసీపీలోకి వచ్చేశారు. అలా వచ్చారో లేదో.. ఎమ్మెల్యే పదవి దక్కింది.. ఆ తర్వాత మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రజిని తన స్టైల్ పాలన సాగించారని చెప్పవచ్చు. అయితే ఈ సమయంలోనే పలు ఆరోపణలను కూడా ఆమె ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, వాటికి కాస్త ఛాన్స్ ఇవ్వలేదు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి రావడంతో విడదల రజిని పై రోజుకొక విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రావడం తోటే, రజిని బిజెపిలోకి వెళ్తారన్న టాక్ నడిచింది. కానీ అలాంటిదేమీ లేదని రజిని ఖండించారు. ఇటీవల రజిని లక్ష్యంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు విమర్శలు గుప్పించారు. అలాగే రజిని కుటుంబసభ్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనితో రజిని మీడియా సమావేశం నిర్వహించి ఫైర్ అయ్యారు. తనను భయపెట్టాలని చూస్తే, అంతు చూస్తానంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో మీడియాతో ఆచితూచి మాట్లాడే రజిని, ప్రస్తుతం అధికారాన్ని కోల్పోవడంతో మీడియా ముందు ఎక్కువగా ప్రత్యక్షమవుతున్నారు.
ఇటీవల వ టిడిపి కార్యకర్త తనను రజిని ప్రోద్బలంతో పోలీసులు వేధించారని ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు రజినిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదైంది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. విడదల రజినితో పాటు నాటి రీజనల్ విజిలెన్స్ అధికారి ఐపీఎస్ జాషువాపైన కేసు నమోదు చేశారు. కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2 గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా విడదల గోపి, ఏ4గా రామకృష్ణ ఉన్నారని తెలుస్తోంది.
Also Read: YCP – I PAC: ఐప్యాక్ సేవలకు వైసీపీ గుడ్ బై? ముంచిందా? మించిందా?
ఏసీబీ కేసుపై మాజీ మంత్రి విడదల రజిని స్పందించారు. కూటమి ప్రభుత్వం తనపై కక్ష కట్టిందని, ఆధారాలు లేకుండా కేసులు పెడుతోందన్నారు. బీసీ మహిళ రాజకీయంగా ఎదగడాన్ని తట్టుకోలేకపోతున్నారని, అక్రమకేసులకు భయపడను, న్యాయపోరాటం చేస్తా అంటూ రజిని స్పందించారు. ఓ వైపు భయపడను అంటూనే రజిని భయపడుతూ.. మీడియా ముందుకు వస్తున్నారని, కానీ అరెస్ట్ ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మొత్తం మీద రజిని అరెస్ట్ ఖాయమేనా? అసలేం జరుగుతుందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.