AP Politics (image credit:Twitter)
ఆంధ్రప్రదేశ్

AP Politics: మళ్లీ వైసీపీలోకి హీరో మహేష్ బాబాయి?

AP Politics: వైఎస్ ఫ్యామిలీతో ఘట్టమనేని కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉంది. నాడు సూపర్ స్టార్ కృష్ణ.. వైఎస్‌తో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. ఆయనంటే ఎనలేని అభిమానం కూడా. పలుమార్లు ఇంటర్వ్యూల్లో కూడా దివంగత నేత వైఎస్సార్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కాంగ్రెస్‌తో ప్రస్థానం మొదలుపెట్టారు. పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోనే రాణించారు.

25 ఏళ్లు కాంగ్రెస్‌ నేతగా కొనసాగారు. తొలిసారి గుంటూరు లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీచేశారు. ఆ తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటిలో, అనంతరం చలనచిత్ర అభివృద్ధి సంస్థలో కీలక పదవులు నిర్వహించారు. వైఎస్ మరణాంతరం వైసీపీలో చేరిపోయారు. పార్టీలో కీల‌క నేత‌గా వ్యవ‌హ‌రించారు. పార్టీకి సంబంధించి కీల‌క నిర్ణయాలు తీసుకునే కొంద‌రిలో ఆయ‌న కూడా ఒక‌రు. అంతేకాదు పార్టీకి కూడా ఆర్థికంగా అండ‌గా నిలిచార‌నే ప్రచారం కూడా ఉంది.

Also Read: Posani Krishna Murali: పోసాని నెక్స్ట్ ప్లాన్ ఏంటి? న్యూటర్న్ ఖాయమేనా?

అప్పట్లో కృష్ణ దంప‌తులు, కృష్ణ, మహేష్ బాబు అభిమానులు చాలా వరకూ వైఎస్ జ‌గ‌న్‌కు అనుకూలంగా ఉండ‌టం, ఆదిశేష‌గిరిరావు కీల‌కనేతగా ఎదిగారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన 2019 ఎన్నికల సమయంలో వైసీపీని అనూహ్యంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ సీటు ఇవ్వలేదని వైసీపీ నుంచి బయటికొచ్చారని చెప్పుకుంటూ ఉంటారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!