Chamala Kiran Kumar Reddy (image cre4dit:Twitter)
Politics

Chamala Kiran Kumar Reddy: కేటీఆర్ బయటకు రావడం ఆనందమే.. ఎంపీ చామల

Chamala Kiran Kumar Reddy: కిషన్ రెడ్డికి సీఎం అవ్వాలని కోరిక ఉన్నదని, బీజేపీ బలోపేతం ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి వెల్లడించారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్ డెవలప్ ను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో చిట్ చాట్ చేశారు. బండి సంజయ్ కేంద్ర సహాయ హోమ్ మంత్రి అని అప్పుడప్పుడు గుర్తు చేయాల్సిన అవసరం ఏర్పడటం సిగ్గుచేటన్నారు. కేంద్రమంత్రిగా ఉండి దొంగల ముఠా అని ఎలా అంటారు? అని ప్రశ్నించారు.

ప్రభుత్వం పనితీరు నచ్చి హరీష్​ రావు కూడా పాజిటివ్ లైన్ లోకి వచ్చేశాడన్నారు. గతంలో నెగెటివ్ గా ఫీలై, నిరసనలు చేశారన్నారు. సమస్యల పరిష్కారానికి సీఎం ను కలవడం సంతోషకరమన్నారు. ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ట్రిపుల్ ఆర్ ను క్యాబినేట్ లో పెట్టాలని కోరామన్నారు. మెట్రో విస్తరణ మీద కూడా లేఖలు రాశామన్నారు.

Also Read; Notice TG Speaker Office: స్పీకర్ ఆఫీస్ కు సుప్రీం నోటీసులు.. స్పందన ఎలా ఉంటుందో?…

కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తున్నామన్నారు. రోడ్లు ఎప్పుడూ ఖాళీగానే ఉన్నాయని విమర్శించారు. పదేళ్లు రాని కేటీఆర్ ఇప్పటికైనా బయటకు రావడం సంతోషకరమన్నారు. డీలిమిటేషన్ పై స్టాలిన్ కంటే ముందే డిప్యూటీ సీఎం భట్టి, జానారెడ్డిలు లేఖలు రాశారని గుర్తు చేశారు. కేటీఆర్ కు తమ పార్టీ వాళ్లను పొగిడేందుకు నోరు రాదన్నారు. ఇక రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇవ్వడం వలనే, బీజేపీ నుంచి వచ్చానని స్వయంగా ఆయనే గతంలో చెప్పారని గుర్తు చేశారు.

Just In

01

BRS Committees: స్థానిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కమిటీలు?.. పేర్లు సేకరిస్తున్న అధిష్టానం!

Khammam ashram school: అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్.. తండ్రి లేని బాలికను ఆశ్రమ స్కూల్ నుంచి గెంటేశారు

Pushpa 3: ‘పుష్ప 3’ ప్రకటించిన సుక్కు.. ఈసారి ర్యాంపేజే!

Viral Fevers: కేజిబీవీలలో విజృంభిస్తున్న విష జ్వరాలు.. ఆలస్యంగా వెలుగులోకి?

KCR KTR Harish Meet: ఎర్రవెల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సుధీర్ఘ చర్చలు.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?