అమరావతి, స్వేచ్ఛ: Operation Garuda In AP: ‘ఆపరేషన్ గరుడ’ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా పలు మెడికల్ దుకాణాలు, మెడికల్ ఏజెన్సీలలో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈగల్ టీమ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్థానిక పోలీసులు, డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ అధికారుల ఆధ్వర్యంలో టీమ్‌గా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో ఔషదాల దుర్వినియోగంపై క్షేత్రస్థాయిలో దాడులు చేశారు. మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీల్లో తనిఖీలు నిర్వహించినట్టు ఈగల్ (ఎలైట్ యాంటీ-నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ఐజీ ఆకే రవి కృష్ణ వెల్లడించారు.
Also read: Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్.. యాంకర్ శ్యామల పిటిషన్‌పై కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..
సీఎం నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలు, హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడ చేపట్టినట్టు వివరించారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా డీజీపీ పనిచేస్తున్నారని ఆయన వివరించారు. గుణదలలో ఓ మెడికల్ షాపు వద్ద మీడియా ప్రతినిధులతో ఈగల్ ఐజీ ఆకే రవి కృష్ణ మాట్లాడారు. ఈ తనిఖీలకు ‘ఆపరేషన్ గరుడ’ అని పేరు పెట్టామని వివరించారు.
100 బృందాల తనిఖీ
రాష్ట్రవ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్టు ఆకే రవి కృష్ణ వెల్లడించారు. ఆపరేషన్ గరుడలో భాగంగా శుక్రవారం ఉదయం గుణదలలో ఒక మందుల షాపులో ఆకస్మిక తనిఖీలు చేశామని అన్నారు. మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని, ఈ విధంగా మందుల విక్రయం జరుగుతుందో లేదో పరిశీలిస్తున్నామని మీడియాకు వివరించారు.
ఆల్బెండజోల్ వంటి కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్ ఇంజక్షన్లను యువత కొనుగోలు చేసి బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: Naga Babu: నవ్విన చంద్రబాబు.. నాగబాబు లాజిక్ ట్వీట్
గంజాయిని కట్టడి చేస్తున్న నేపథ్యంలో యువత నిబంధనలకు విరుద్ధంగా ఈ ఔషధాలను కొనుగోలు చేసి వినియోగిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆకే రవి కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం గతంలో కంటే కట్టుదిట్టంగా ఎన్‌డీపీ యాక్ట్‌ను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. యువత ఇలాంటి మత్తు టాబ్లెట్లకు బానిసలు కాకుండా దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు జరిపి ఇలాంటి అమ్మకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణ హెచ్చరించారు. డ్రగ్స్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also read: Posani Krishana Murali : పోసానికి వచ్చింది.. వంశీకి రాలేదు! ఒకటి మాత్రం ఇద్దరికి సేమే!
అనుమతి లేని మందులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, మందులకు సరిగా బిల్లులు ఇవ్వని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సిన మందులు మాత్రమే మందుల షాపులో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించే మెడికల్ షాపులపై చర్యలు తీసుకుంటామని ఎంబీఆర్ ప్రసాద్ హెచ్చరించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్‌ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/3989023/AP-Edition/Swetcha-daily-AP-epaper-22-03-2025#page/1/1