Nithiin and Venky Kudumula (Image Source: Youtube)
ఎంటర్‌టైన్మెంట్

Robinhood: ‘గ్రోక్’ చెప్పిందే జరిగింది.. ఫైనల్‌గా డేవిడ్ వార్నర్‌కు లింక్ పెట్టారుగా!

Robinhood: నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. మార్చి 28న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ వెరైటీగా నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ఈ మధ్య వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ప్రమోషన్స్ ఎలా అయితే నిర్వహించారో, కాస్త అటు ఇటుగా ఆ రేంజ్‌లోనే టీమ్ ప్రయత్నం చేస్తుంది. వెరైటీగా ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న ‘గ్రోక్’ని కూడా మధ్యమధ్యలో గోకుతూ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా ‘గ్రోక్’తో హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల తమ చిత్ర ట్రైలర్‌ విడుదలకు మంచి డేట్ చెప్పమని అడిగిన విషయం తెలిసిందే.

Also Read- Naga Vamsi: 50వ సినిమా పవన్ కళ్యాణ్‌తో చేయను.. నాకు ఇష్టమైన ఎన్టీఆర్‌తో చేస్తా!

ఆ సమయంలో వారిద్దరితో ‘గ్రోక్’ మాములుగా ఆడుకోలేదు. తెలుగులో మాట్లాడుతూనే, వారిపై పంచ్‌లు పేల్చింది. ట్రైలర్ విడుదలకు డేట్, టైమ్ చెప్పి.. ఏనాడైనా కరెక్ట్‌గా విడుదల చేశారా? అంటూ క్వశ్చన్ చేసింది. ఫైనల్‌గా ఒక డేట్‌ని ఫిక్స్ చేయగా.. నిజంగానే గ్రోక్ చెప్పినట్లుగా ఇప్పుడా ట్రైలర్ విడుదలను వాయిదా వేశారు. ఈ విషయం చెప్పేందుకు కూడా మళ్లీ గ్రోక్‌నే గోకుతూ మరో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో కూడా గ్రోక్ గట్టిగానే పంచులు పేల్చింది. ఈసారి కూడా గ్రోక్ ఓ డేట్‌ని ఫిక్స్ చేస్తూ.. ఎలాగూ డేవిడ్ వార్నర్ వస్తున్నాడుగా.. ప్రీ రిలీజ్ వేడుకలోనే ట్రైలర్ విడుదల చేయండి అంటూ సలహా ఇచ్చినట్లుగా ఓ వీడియోను మేకర్స్ పోస్ట్ చేశారు.

మార్చి 23న జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు ఈ ట్రైలర్ లాంచ్ వేడుక వాయిదా పడటానికి కారణం థియేటర్‌ ఫంక్షన్‌కు అనుమతి లభించకపోవడమే అని తెలుస్తుంది. అందుకే, ప్రీ రిలీజ్ వేడుకలోనే ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్సయ్యారు. ఈ విషయాన్ని కూడా ప్రమోషన్‌గా వాడుకునేందుకు ‘గ్రోక్’తో వీడియోను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

మరోవైపు శ్రీలీలతో పాడ్‌క్యాస్ట్ 03ని మేకర్స్ వదిలారు. ఇందులో నితిన్, శ్రీలీల మధ్య మాములుగా పంచులు పేలలేదు. వెల్‌కమ్ టు హానెస్ట్ పాడు కాస్ట్ అంటూ.. ఛీ ఛీ పాడ్ ‌క్యాస్ట్ అని నితిన్ స్వాగతం పలికితే.. శ్రీలీల నవ్వేసింది. ఇక నితిన్ క్వశ్చన్స్ అడగడం మొదలెట్టారు. మీరు సినిమాలో బయటకు వెళ్లిన ప్రతిసారి హీరో కంటే విలన్‌కే ఎక్కువ ఎందుకు దొరుకుతారు? అని ప్రశ్నించగా.. ‘హీరో కంటే ఎక్కువ విలన్‌కే నామీద ఇంట్రస్ట్ ఎక్కువ’ అనగానే నితిన్ చెంప పేలింది. ‘బ్యాడ్ బాయ్స్ అంటే మీకెందుకు అంత ఇష్టం’ అని నితిన్ ప్రశ్నిస్తే.. ‘బాయ్స్ అంటేనే బ్యాడ్.. అందులో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి?’ అని శ్రీలీల చెప్పగానే వావ్ అనేశారు నితిన్.

Also Read- Betting Apps: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో.. రూ. 80 లక్షలు నష్టపోయిన బెట్టింగ్ బాధితుడు

సీరియస్ సీన్‌లో కూడా లిప్ స్టిక్ ఎందుకు పెడతారు? అని అడిగితే.. మీలాగా స్టిక్స్ పట్టుకోలేం కాబట్టి.. మేము లిప్‌స్టిక్ పెట్టుకుంటాం.
హీరోలు ఫైట్ చేస్తుంటే, హీరోయిన్లు ఎందుకు ప్రేమలో పడతారు? అంటే, పడకపోతే బాధరాదు కాబట్టి.
హీరోయిన్లు వచ్చినప్పుడే వర్షం, పూలు ఎందుకు పడుతుంటాయ్? అంటే.. మాకు హీరోలే కాదు, అవి కూడా పడతాయ్.. ఇలా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ.. వావ్, ఎక్స్‌ట్రార్డినరీ అనేలా ఉంది. ఇక ఈ వీడియోకు కామెంట్స్ చూడాలి. అది మ్యాటర్.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?