Chamala Kiran Kumar Reddy (imagecredit:face book)
Politics

Chamala Kiran Kumar Reddy: పదేళ్లు ముంచారు.. ఇప్పుడు మండి పోతున్నారు.. ఎంపీ చామల

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Chamala Kiran Kumar Reddy: కేంద్ర ప్రభుత్వానికి రైతుల గురించి ఆలోచించే సమయం లేదా? అంటూ ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడుతూ.. పదేళ్లలో ఎంత మందికి రుణమాఫీ చేశారు? అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. సబ్ కే సాత్ సబ్ కా వికాస్, అచ్చే దిన్ ఆనే వాలే హై, వికసిత భారత్, ఆత్మ నిర్భర భారత్, ఘర్ ఘర్ రోజ్ గార్ అని నినాదాలు చేసే కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదో? క్లారిటీ ఇవ్వాలన్నారు.

దేశంలో 60 శాతం మంది రైతులు వ్యవసాయంపై ఆధార పడి ఉన్నారన్నారు. 60 శాతం రైతాంగానికి బడ్జెట్లో 3.8 శాతం కేటాయించారన్నారు. 2024 –25 లో 1.41 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ప్రస్తుతం దాన్ని 1.37 లక్షల కోట్లకు తగ్గించారన్నారు. దేశంలో ఉన్న రైతులు కంటే కార్పొరేట్ వ్యవస్థకే బీజేపీ పెద్దపీట వేస్తుందని అన్నారు. కార్పొరేట్ లకు దాదాపు 3 లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రైతుల గురించి ఆలోచించే సమయం లేకపోవడం సిగ్గు చేటన్నారు. మద్ధతు ధర అమలు, స్వామి నాథన్ కమిషన్ సిఫారులు ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదన్నారు.

Also Read: SC on TG Govt: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?

ప్రధాన మంత్రి పసల్ భీమా యోజన కు 22.9 శాతం నిధులు తగ్గించారన్నారు. మన్మోహన్ సింగ్ హయంలో రూ.60 వేల కోట్ల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. తెలంగాణలో 22.35 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. బడ్జెట్ లో 20 శాతం నిధులు రైతుల కోసం ఖర్చు చేయబోతున్నామన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ. 12 వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు. క్వింటాల్ సన్నబియ్యానికి రూ. 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామన్నారు. రైతులకు ఇన్సురెన్స్ క్లెయిమ్స్ పారదర్శకంగా అందజేయాలని అన్నారు.

Also Read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!