AP Govt: ఏపీ ప్రజలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు మరో కొత్త నిర్ణయంతో ప్రజల ముందుకు రానున్నారు. దీని ద్వార పేద ప్రజలకు అధిక మేలు చేకూర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇంతకు ప్రభుత్వం తీసుకుంటున్న ఆ నిర్ణయం ఏమిటి? అసలు పేదలకు ఏ మేరకు లబ్ది చేకూరుతుందో తెలుసుకుందాం.
పేదలు.. కడుపునిండా ఆహారానికి దూరం.. ఒంటి నిండా వస్త్రధారణకు దూరం. అంతేకాదు నివసించేందుకు గూడు కూడా వీరికి దూరమే. అటువంటి దీన స్థితిగతులను ఎదుర్కొంటున్న వారు ఎందరో నేటికీ మనకు కనిపిస్తుంటారు. కొందరు మధ్య తరగతి జీవనం గడుపుతున్నా.. ఆ కుటుంబాల ఆర్థిక సమస్యలు కోకొల్లలు. ఇక ధనికుల గురించి చెప్పనవసరం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజల అభివృద్దికి దోహద పడేవే ప్రభుత్వ పథకాలు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందుకే పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. ఆర్థిక కష్టాలు నివారించేందుకు స్వయం సహాయక సంఘాలు, తక్కువ వడ్డీకే రుణాలు, ఉపాధి అవకాశాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, దీపం పథకం 2.0 ద్వారా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది.
అలాగే పింఛన్ పెంచి ఎందరో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, సుధీర్ఘ వ్యాధిగ్రస్తులకు మేలు చేకూర్చింది. ఇలా పలు ఆర్థిక చేయూత పథకాలను అమలు చేసిన ప్రభుత్వం, పేదల కోసం మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. దీనితో రాష్ట్రంలో పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే పీ4 పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ఈ పథకం ద్వారా పేద ప్రజలకు తక్కువ కాలంలో ధనికులను చేయాలన్న సంకల్పం సీఎం చంద్రబాబుది. అందుకే రాష్ట్ర అభివృద్ది పనుల్లో ప్రజలు కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అందులో వాటాను పొంది వచ్చిన లాభాన్ని ఆర్జించే అవకాశం ప్రజలకు చేరువ కావడం హర్షించదగ్గ విషయం. ఇలా పీ4 అమలు చేసేందుకు సిద్దమైన ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో పేదరికం అనుభవిస్తున్న కుటుంబాలు 30 లక్షల వరకు ఉన్నాయని సమాచారం. వీరికి ఆర్థిక కష్టాలతో పాటు జీవన మనుగడ సాగించే ఉపాధి అవకాశాలు దరి చేర్చాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. అందుకే కాబోలు పేదరికంలో ఉన్న 30 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునే ఏర్పాట్లు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో గల ధనవంతులు సేవా దృక్పథంతో ముందడుగు వేసి, దత్తత కార్యక్రమానికి సహకరించాలని సీఎం పిలుపునిచ్చారు.
Also Read: Sitarampur Man Suicide: వచ్చేది సరిపోదా? మరీ ఇంత కక్కుర్తి ఎందుకు? నెటిజన్స్ ఫైర్…
ఈ పిలుపును అందుకొని పేదలను ఆదుకొనేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద పేదలను దత్తత తీసుకొని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావించడం శుభపరిణామం అంటున్నారు ప్రజలు. మరెందుకు ఆలస్యం.. పేదలను దత్తత తీసుకోండి.. శ్రీమంతులు కండి!