Telangana State Women Commission: ఈ మధ్యకాలంలో వస్తున్న కొన్ని పాటలలో డ్యాన్స్ చూసిన వారంతా పెదవి విరుస్తున్న నేపథ్యంలో.. ఏదైనా లిమిట్స్ దాటనంత వరకే, ప్రతి విషయంలో కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా.. మేము స్టార్స్, మా ఇష్టం వచ్చినట్లు వెళతామంటే కుదరదు. సమాజంపై దాని ప్రభావం పడుతుందని గమనించుకోవాలని హెచ్చరిక చేశారు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శారద నేరేళ్ల. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇందులో ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు కానీ, ఆమె హెచ్చరిక చేసింది ఎవరికనేది మాత్రం ఈజీగా చెప్పేయవచ్చు.
Also Read- TFPC: సీఎం గారూ కృతజ్ఞతలు.. టాలీవుడ్‌లో సంతోషాన్ని నింపిన సీఎం.. మ్యాటర్ ఏంటంటే?
ఈ మధ్యకాలంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’, ‘డాకు మహారాజ్’.. లేటెస్ట్‌గా ‘రాబిన్‌హుడ్’ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లపై ఎలా ట్రోలింగ్ నడిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూడు పాటలకు కొరియోగ్రాఫర్ ఒక్కరే కావడం విశేషం. వారి పేరు ఇక్కడ మెన్షన్ చేయడం లేదులే కానీ, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా దూసుకెళుతున్నారు. మరి అలాంటి మాస్టర్, కాస్త సమాజం, యువత, పిల్లలు తమ స్టెప్స్ ద్వారా ప్రభావితం అవుతారేమో అని గమనించకపోవడం విడ్డూరమనే చెప్పాలి. లేదంటే, అలాంటి స్టెప్సే తనని స్టార్ హోదా నుంచి దిగకుండా చేస్తాయని భావిస్తున్నారో తెలియదు కానీ, ప్రస్తుతానికైతే మాస్టర్‌పై కొందరు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకే, విషయాన్ని మహిళా కమిషన్ వరకు తీసుకెళ్లారు. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శారద నేరేళ్ల (Sharada Nerella) చేసిన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్
పత్రికా ప్రకటన
తేదీ: మార్చి 20, 2025తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది…
— Sharada Nerella (@sharadanerella) March 20, 2025
‘‘తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఇటీవల కొన్ని సినిమాలలోని పాటల్లో ఉపయోగిస్తున్న డ్యాన్స్ స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయనేలా పలు ఫిర్యాదులు అందాయి. ఈ అంశంపై కమిషన్ తీవ్రంగా స్పందించింది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే శక్తివంతమైన మాధ్యమం అని అందరికీ తెలుసు. ఇందులో మహిళలను అవమానించే లేదా అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు, సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరిస్తోంది.
Also Read- Vijay Deverakonda: చట్టప్రకారం నిర్వహిస్తున్న గేమ్స్‌నే ప్రచారం చేశా.. ఆ వార్తలు నిజం కాదు
మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డ్యాన్స్ స్టెప్స్‌ను వెంటనే నిలిపివేయాలి. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడంతో పాటు, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత. యువత, పిల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఈ అంశంపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషన్‌కు తెలియజేయవచ్చు. ఈ విషయంపై నిశితంగా పరిశీలన కొనసాగిస్తూ, అవసరమైన విధంగా మరిన్ని చర్యలు తీసుకుంటాం..’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు