Nara Lokesh vs Botsa(image credit: twitter)
ఆంధ్రప్రదేశ్

Nara Lokesh vs Botsa: అంతా మీరే చేశారు.. వైసీపీపై లోకేష్ గరంగరం..

అమరావతి, స్వేచ్ఛ: Nara Lokesh vs Botsa: వైసీపీ హయాంలో విద్యావ్యవస్థపై బుధవారం శాసన మండలిలో సుదీర్ఘ చర్చ సాగింది. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ వర్సెస్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌గా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో 2014-2019 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయో, 2019-2024 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దామ‌ని లోకేష్‌కు బొత్స స‌వాల్ విసిరారు. ప్రభుత్వ స్కూళ్లు, ఇంటర్‌లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇందుకు మంత్రి సమాధానం ఇస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్‌లో చదువుతున్నారో డేటా లేదని విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన బొత్స చెప్పడమేంటి? విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు పారిపోయారు, ఇప్పుడొచ్చి ప్రశ్నిస్తున్నారు. హౌస్ అజెండా బీఏసీ నిర్ణయిస్తుంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేం సన్నద్ధమై సభకు వచ్చాం. హౌస్ ఛైర్మన్ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ చెప్పినట్లు నడవదు’ అని లోకేష్ చెప్పారు.

చర్చకు మేం సిద్ధం..

స్కూళ్లు, ఇంటర్ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నాను. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలి. దీనిపై చర్చకు సిద్ధం. ఎక్కడ తగ్గారు? ఏ పాఠశాలలో తగ్గారు? ఎక్కడికి వెళ్లారు? ఏ ప్రైవేటు పాఠశాలలో సంఖ్య పెరిగింది? అనేది మేం చెబుతాం. వైసీపీ హయాంలో డ్రాప్ బాక్స్ విధానం తీసుకువచ్చారు. గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో పెంచేందుకు విద్యార్థులను డ్రాప్ బాక్స్‌లో పెట్టారు.

17 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న విద్యార్థులు లక్ష మంది పాఠశాల విద్యలో ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వగలం. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ అచీవ్ మెంట్ సర్వే చూస్తే 2017లో ఇంగ్లీష్‌లో ఇండియాలో నాలుగో స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14 స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలి. 10వ తరగతి సోషల్ సైన్స్‌లో 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. సైన్స్ విషయానికి వస్తే మొదటిస్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం.

Also Read: Star Heroine: బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్.. చర్యలు తీసుకుంటారా?

గణితంలో మొదటిస్థానం నుంచి 12వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. ఐబీ విషయానికి వస్తే కేవలం ఒక కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం రూ.4.86 కోట్లు ఖర్చు పెట్టారు. ఐబీ కరిక్యులమ్ అమలు చేశామని ఎలా చెబుతారు? ఏ పాఠశాలలో అమలు చేశారు ఐబీ? సమాధానం చెప్పాలి’ అని బొత్సపై లోకేష్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఛాలెంజ్‌గా తీసుకున్నాం..

వైసీపీ హయాంలో ఎంతమంది పిల్లలు, ఏ స్కూల్‌లో చదువుతున్నారో డేటా లేకుండా వైసీపీ చేసింది. రెండేళ్లు మంత్రిగా పనిచేసిన బొత్స డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి. ఏ టీచర్ ఏ స్కూల్‌లో పాఠాలు చెబుతున్నారో డేటా లేదు. సమాధానం చెప్పాలి. ఏ డేటా లేక బేసిక్ డ్యాష్ బోర్డ్ తయారు చేయలేకపోతున్నాం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిప్పుడు 6నెలల్లో డ్యాష్ బోర్డు రూపొందించాం. గ్రిప్ వచ్చింది. విద్యారంగంలో ఇప్పుడిప్పుడే డ్యాష్ బోర్డ్ తయారవుతోంది. వైసీపీ మాదిరిగా విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు పంపడం లేదు.

నూటికి నూరు శాతం ఉపాధ్యాయులు పాఠాలే చెప్పాలనే విధానానికి కట్టుబడి ఉన్నాం. యాప్‌ల భారం తగ్గిస్తున్నాం. సింగిల్ యాప్ తీసుకువస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపును ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీటుకు రికమెండ్ చేయాలని ఎప్పుడైతే ప్రజాప్రతినిధులను తల్లిదండ్రులు అడుగుతారో అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగాయనే నమ్మకం ఏర్పడుతుంది. దీనిని ఛాలెంజ్‌గా తీసుకున్నాం. ఇందుకు రెండేళ్ల సమయం ఇవ్వాలి. కచ్చితంగా చేసి చూపిస్తాం’ అని లోకేష్ సభా వేదికగా స్పష్టం చేశారు.

ప్రైవేటు రంగంలో వర్శిటీలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తామని లోకేష్ తెలిపారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ రెండో సవరణ బిల్లు-2025ను శానససభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును సభ ఆమోదించడం జరిగింది. ‘రాష్ట్రంలో సెంచూరియన్ యూనివర్సిటీ తీసుకురావడం జరిగింది. సాంకేతిక అంశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం. గ్రీన్ ఫీల్డ్ గురించి ఇప్పటికే చర్చించాం. బ్రౌన్ ఫీల్డ్ కింద ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తించాలని కోరుకున్నప్పుడు కేంద్ర, రాష్ట్ర నిబంధనల ప్రకారం వీవీఐటీ ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తించాలని కోరడం జరిగింది. యూనివర్సిటీ ఎప్పుడు వచ్చినా చట్టసభల్లో యాక్ట్ కింద సవరణ చేసి యూనివర్సిటీ పేరును ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది’ అని లోకేష్ వెల్లడించారు.

టీచర్స్ బదిలీల చట్టం చరిత్ర

ఏపీ రాష్ట్ర ఉపాధ్యాయ బదిలీల క్రమబద్ధీకరణ బిల్లు-2025ను లోకేష్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ‘రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల చట్టం ఒక చరిత్ర. ఈ బిల్లు ద్వారా కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోంది. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో చంద్రబాబు పాలనలో పారదర్శకంగా వ్యవహరించడం జరిగింది. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూల్స్ విషయానికి వస్తే వారికి సొంత మార్గదర్శకాలు ఉన్నాయి. గతంలో అనేక కోర్టు కేసులు, కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కూడా ఉన్నాయి.

అందేకే ఏకీకృత చట్టం తీసుకురావాలని భావించాం. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా ఉపాధ్యాయ బదిలీలు చేశారు. ఒక పద్ధతిని పాటించకుండా ఇష్టారాజ్యంగా చేశారు. కావాలని కొంతమందిపై రాజకీయ కక్షతో బదిలీలను నిలిపివేశారు. గడచిన ఐదేళ్లలో అనేక లిటిగేషన్స్ వచ్చాయి. అనేకసార్లు కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. రాజకీయ జోక్యాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. బోధనపైనే ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది’ అని లోకేష్ తెలిపారు.

అనాలోచిత నిర్ణయాలతోనే..

వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు దారుణంగా పడిపోయాయనిలోకేష్ పేర్కొన్నారు. ‘ 2014-24 మధ్య పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను బేరీజు వేస్తే , వైసీపీ పాలనలో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకం చదివేందుకు ఇబ్బందిపడ్డారు. 2014లో 57 శాతం మంది విద్యార్థులు చదవగలిగితే, జగన్ రెడ్డి పాలనలో 37.5 శాతానికి పడిపోయిందని అసర్ నివేదిక స్పష్టం చేసింది. 8వ తరగతి విద్యార్థులు రెండో తరగతి తెలుగు పుస్తకాన్ని 2014లో సుమారు 80 శాతం మంది చదవగలిగితే, 2024కు వచ్చేనాటికి 53 శాతానికి పడిపోయింది. మూడో తరగతి విద్యార్థుల్లో 85 శాతం మంది విద్యార్థులు కనీసం రెండో తరగతి టెక్ట్స్ బుక్ చదవలేకపోతున్నారు.

ఐదో తరగతి విద్యార్థుల్లో 63 శాతం విద్యార్థులు బేసిక్ గ్రేడింగ్ చేయలేకపోతున్నారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కలిపి సుమారు 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ఇప్పుడు ఆ సంఖ్య 33.4 లక్షలుగా ఉంది. వైసీపీ పాలనలో అనాలోచిత నిర్ణయాలు, చర్చ లేకుండా సంస్కరణలు తీసుకువచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులపై, తల్లిదండ్రులపై రుద్దారు. 117 జీవోలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. కూటమి ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పెంచేందుకు 10,15 సంస్కరణలు తీసుకువస్తున్నాం. బోధనలో సాంకేతికతను జోడిస్తాం. మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు ద్వారా తరగతికో ఉపాధ్యాయుడిని కేటాయిస్తాం’ అని లోకేష్ మండలిలో వివరించారు.

గ్రామసభల్లో చర్చిద్దామా?

రాష్ట్రంలో 2014-2019 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయి? 2019-2024 మధ్య ఎలా ఉన్నాయి? పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దామ‌ని మంత్రి లోకేష్‌కు బొత్స స‌వాల్ విసిరారు. 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లకు దూరమయ్యారనడం సరికాద‌న్నారు. లోకేష్‌కు ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేద‌ని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భం లేద‌న్నారు.

ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాద‌న్నారు. సౌకర్యాలపై సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుంద‌ని, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించాలన్నదే తమ విధానమ‌న్నారు. ప్రాధమిక విద్య నుంచి టోఫెల్ విద్యను నేర్పించడం, ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం, సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను అమ‌లు చేసేందుకు నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నార‌ని చెప్పారు. జ‌గ‌న్ కృషితో గ‌తేడాది 80 శాతం మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారని బొత్స గుర్తు చేశారు.

Also Read: TDP Alliance govt: వైసీపీకి బిగ్ షాక్.. ఆ ఒక్కటి వదలని కూటమి..

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు