Chiranjeevi and Anil Ravipudi Project Heroine (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Chiru-Anil: చిరంజీవి – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఫిక్సయిందా?

Chiru-Anil: మెగాస్టార్ చిరంజీవి వరుస చిత్రాలతో కుర్ర హీరోలకు సైతం పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో రెండు సినిమాలకు మెగాస్టార్ (Megastar Chiranjeevi) సైన్ చేశారు. అందులో ఒకటి ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో చేసే చిత్రం కాగా, రెండోది ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో. ఈ రెండు సినిమాలలో ముందు అనిల్ రావిపూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుపుకుంటోంది. కథ కూడా సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో.. అనిల్ రావిపూడి (Anil Ravipudi) క్యాస్ట్ అండ్ క్రూ సెలక్ట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read- Rashmika Mandanna: ‘సికిందర్’తో స్టెప్పులు.. రష్మిక ఖాతాలో ఇంకోటి వేసుకోవచ్చా!

ఈ క్రమంలో ఈ సినిమాలో నటించేందుకు ఓకే అయినట్లుగా కొన్ని పేర్లు అప్పుడే టాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతుండటం విశేషం. మరీ ముఖ్యంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్‌లో భాగమైన బుల్లిరాజు.. చిరు-అనిల్ రావిపూడి చిత్రంలోనూ ఉంటాడని తెలుస్తుంది. అందుకోసం బుల్లిరాజుకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. అలాగే అదే సినిమాకు సంగీతం అందించిన భీమ్స్‌ని అనిల్ రావిపూడి ఈ సినిమాకు కంటిన్యూ చేయబోతున్నాడని అనుకుంటున్నారు. ఇక ఇవన్నీ ఇలా ఉంటే, ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండే అవకాశం ఉందనేలా టాక్ నడుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింతగా ఆసక్తి పెరుగుతోంది.

ఎందుకంటే, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అనుకున్నప్పుడు అనిల్ అనౌన్స్ చేసిన హీరోయిన్ల పేర్లతో అంతా పెదవి విరిచారు. వెంకీ ఏజ్ ఎక్కడ? ఆ హీరోయిన్ల ఏజ్ ఎక్కడ? అంటూ ట్రోల్ కూడా చేశారు. కానీ, ఐశ్వర్య, మీనాక్షి వారి పాత్రలను ఎలా పండించారో, ఆ సినిమా సక్సెస్‌లో ఎలా భాగమయ్యారో అంతా ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడదే ఫార్మలాను మళ్లీ అనిల్ కంటిన్యూ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే ఆ హీరోయిన్లను కాదులెండి.. కొత్తగా మరో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ ఎవరంటే..

Also Read- Betting Apps: మరో ఆరుగురికి నోటీసులు.. అందులో యాంకర్ శ్యామల కూడా!

‘సీతారామం’ సినిమాతో అందరి మనసులు గెలుచుకున్న మృణాల్ ఠాకూర్‌ (Mrunal Thakur)ను ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించేందుకు సంప్రదించారనేది లేటెస్ట్ టాక్. అలాగే అంతకు ముందు, అదితి రావ్ హైదరి (Aditi Rao Hydari)ని కూడా ఈ సినిమా కోసం హీరోయిన్‌గా సంప్రదించారట. మరి వీరిద్దరా? వీరిద్దరిలో ఒకరా? అనేది తెలియాలంటే మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. మరో వైపు ‘విశ్వంభర’ బ్యాలెన్స్ షూట్ పూర్తి చేసి, తర్వాత సినిమాల షూటింగ్‌లో బిజీ అయ్యేందుకు చిరు చూస్తున్నట్లుగా సమాచారం.

వాస్తవానికి ‘విశ్వంభర’ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ, టీజర్ తర్వాత విఎఫ్‌ఎక్స్ వర్క్‌పై వచ్చిన ట్రోలింగ్‌తో మేకర్స్ మళ్లీ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఐకానిక్ డేట్ మే 9న ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. కానీ, అదే రోజున వచ్చేందుకు ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) డేట్ ఫిక్స్ చేసుకోవడంతో కచ్చితంగా ఆ తేదీన ‘విశ్వంభర’ రాదనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. చిరు బర్త్‌డే రోజున ‘విశ్వంభర’ విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. చూద్దాం.. అఫీషియల్‌గా ఏ తేదీని ఫిక్స్ చేస్తారో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు