Rashmika Mandanna: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఏదైనా సరే అక్కడ మన మార్క్ పడాల్సిందే అనేలా దూసుకెళ్తుంది నేషనల్ క్రష్ రష్మికా మందన్నా. టాలీవుడ్‌లో టాప్ ఛైర్ సొంతం చేసుకున్న అనంతరం బాలీవుడ్‌లో అడుగుపెట్టిన రష్మికా మందన్నాకు అక్కడ కూడా సక్సెస్ ద్వారాలు తెరుచుకున్నాయి. వరుస హిట్స్ సాధిస్తూ.. బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ బిజీ నటిగా మారిపోయింది. ‘యానిమల్’ తర్వాత రీసెంట్‌గా ఆమె చేసిన ‘ఛావా’ చిత్రం కూడా ప్రేక్షకుల నుంచి మన్ననలను అందుకుని బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రష్మిక పేరు అక్కడ మారుమోగుతోంది. ప్రస్తుతం ఈ భామ తన మకాంను కూడా ముంబైకి మార్చే పనిలో ఉన్నట్లుగా టాక్ వినబడుతుందంటే.. బాలీవుడ్‌పై ఆమె ఎంత మోజుగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read- Manchu Manoj: మోహన్ బాబు బర్త్‌డే.. మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!
‘ఛావా’ తర్వాత ఆమెకు బాలీవుడ్‌లో వరస అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)తో ‘సికిందర్’ అనే చిత్రంతో మళ్లీ బాలీవుడ్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది రష్మిక. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే రష్మిక ఖాతాలో మరో హిట్ పక్కా అనేలానే ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘సికిందర్ నాచే’ (Sikandar Naache) అనే సాంగ్, అందులో సల్మాన్, రష్మిక (Salman and Rashmika)ల స్టెప్పులు చూస్తుంటే.. రష్మిక ఇంకోటి వేసుకోవచ్చనేలా ఆమె అభిమానులు ఫీల్ అవుతున్నారు.
‘నిన్ను రక్షించేది.. పూజించేది… ఈ సికిందర్ మాత్రమే..
నిన్ను గెలుచుకోవడానికి మరణించడానికైనా వెనుకాడను’ అనే లిరిక్స్‌తో వచ్చిన ఈ పాటలో ఇద్దరూ కూడా చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఇద్దరూ స్టెప్పులు స్టైలీష్‌గా ఉండటంతో పాటు, కొరియోగ్రఫీ, కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ అన్నీ కూడా ఈ పాట గురించి మాట్లాడుకునేలా చేస్తున్నాయి. తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాజిద్ నడియాడ్వాలా భారీ బడ్జెట‌్‌తో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. కాజల్, సత్యరాజ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రాన్ని రాబోయే ఈద్‌కు విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వైపు నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తూనే, మరోవైపు సినిమా ప్రమోషన్స్‌ని కూడా మేకర్స్ స్టార్ట్ చేశారు. అందులో భాగంగా వచ్చిన ఈ ‘సికిందర్ నాచే’ పాట.. ట్రెండ్ అవుతూ సినిమాను వార్తలలో ఉండేలా చేస్తుంది.
Also Read- Betting Apps: మరో ఆరుగురికి నోటీసులు.. అందులో యాంకర్ శ్యామల కూడా!
రష్మికా మందన్నా విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె మంచి ప్లానింగ్‌తో సినిమాలను చేస్తుంది. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స్థానం సొంతం చేసుకుని, మధ్యలో కోలీవుడ్‌లోనూ తన సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాపై ఫోకస్ పెట్టింది. బాలీవుడ్ తర్వాత ఈ నేషనల్ క్రష్ హాలీవుడ్ అని అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరోవైపు విజయ్ దేవరకొండతో డేటింగ్ చేస్తుందనేలా కూడా ఆమెపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు