Betting Apps (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Betting Apps: మరో ఆరుగురికి నోటీసులు.. అందులో యాంకర్ శ్యామల కూడా!

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై కాదు, వాటిని ప్రమోట్ చేస్తున్న వారిపై ప్రస్తుతం పెద్ద యుద్ధమే జరుగుతున్న విషయం తెలిసిందే. టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ చొరవతో.. ఈ యుద్ధం, మహాయుద్ధంగా మారింది. సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న ఇన్‌ఫ్లూయెన్సర్లను, యాంకర్లను, నటీనటులను ఒక్కొక్కరినీ బయటికి తీసి మరీ కేసులు నమోదు చేస్తున్నారు. సజ్జనార్ పిలుపుతో నెటిజన్లు, కొందరు సెలబ్రిటీలు కూడా డ్యూటీ ఎక్కేశారు. సెలబ్రిటీలు ఈ బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన కల్పించేలా వీడియోలు చేస్తుంటే, నెటిజన్లు మాత్రం ఇంతకు ముందు ఎవరెవరు ఈ యాప్స్‌ని ప్రమోట్ చేశారో వారి లిస్ట్‌ని పోస్ట్ చేస్తూ, సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్నారు. కట్ చేస్తే, వారిపై వెంటనే కేసులు నమోదవుతున్నాయి. అలా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటి వరకు 11 మందిపై కేసులు నమోదు అయినట్లుగా పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.

Also Read- Sunita Williams Return: హీరోచితంగా భూమిపైకి.. సునీత విలియమ్స్ రిటర్న్‌పై సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!

ఈ 11 మందిలో విష్ణు ప్రియ, టేస్టీ తేజాలకు ఆల్రెడీ నోటీసులు వెళ్లాయి. వారి తరపున శేఖర్ భాషా మంగళవారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి, ఆ ఇద్దరికి మూడు రోజుల సమయం కావాలని పోలీసులను కోరారు. మూడు రోజుల తర్వాత వారు విచారణకు హాజరవుతారని తెలిపారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడీ 11 మందిలో మరో ఆరుగురుకి పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారు. యాంకర్ కమ్ నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ, సుధీర్‌లకు నోటీసులు ఇవ్వగా.. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి దుబాయ్‌కి పరారైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నోటీసులు ఇచ్చిన ఆరుగురిని గురువారం విచారణకు హాజరు కావాలని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు,

ఇంకా ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న హీరో, హీరోయిన్లతో పాటు ఇతర ఇన్‌ఫ్లూయెన్సర్లపై కూడా నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ వంటి వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందనేలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. వారు ఈ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. నెటిజన్లు కొందరు ఆ వీడియోలను పదే పదే షేర్ చేస్తూ.. మరి వీరిపై చర్యలుండవా? అంటూ పోలీసులను క్వశ్చన్ చేస్తున్నారు. దీంతో, పోలీసులు వారిపై కూడా దృష్టి పెట్టినట్లుగా తెలిపారు.

Also Read- MS Dhoni – Sandeep Vanga: ‘యానిమల్’ దర్శకుడితో ఎమ్.ఎస్. ధోని.. సినిమా చూపించేశారుగా!

ఇదిలా ఉంటే, కొందరు నెటిజన్లు పోలీసుల చర్యలను ఖండిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే వారికి ఎందుకు నోటీసులు ఇస్తున్నారు. అసలు ఆ బెట్టింగ్ యాప్స్ నడిపే వారిని అరెస్ట్ చేసి, వాటిని ఆపేయవచ్చు కదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలా యాప్స్ లేకుండా ఉంటే, వీళ్లు ప్రచారం చేయరు కదా.. ఆ దిశగా ఎందుకు పోలీసులు ఆలోచన చేయడం లేదు? కేవలం ప్రచారం చేశారని, వారికి నోటీసులు ఇచ్చి, వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఒకసారి ఆలోచించండి? అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ