Shock to Jagan (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Shock to Jagan: జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. త్వరలో వైకాపా ఖాళీ?

Shock to Jagan: ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అంటూ గతంలో సినిమా రేంజ్ డైలాగ్స్ చెప్పిన ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. సొంత నేతలే జగన్ కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తను సీఎంగా ఉన్నప్పుడు ‘సలాం నమస్తే’ అంటూ చేతులు నొప్పులు వచ్చేలా సెల్యూట్ కొట్టిన నేతలంతా అధికారం పోయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ హయాంలో ఎమ్మెల్సీగా ఎంపికైన వారు వరుసగా పార్టీని వీడుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం అధికార పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ (Marri Rajasekhar) ఆ పార్టీకి రాజీనామా చేశారు.

మరో వికెట్ డౌన్
ఏపీలో విపక్ష వైకాపా (YSRCP Party)కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా ఆ పార్టీలో మరో వికెట్ డౌన్ అయ్యింది. పల్నాడు జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేత మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. 2029 వరకూ పదవి కాలం ఉన్నప్పటికీ ఆ పార్టీలో ఇమడలేక బయటకు వచ్చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేనురాజును కలిసి అందజేశారు. చిలకలూరిపేట వైకాపా ఇన్‌ఛార్జ్‌గా ఇటీవల మాజీ మంత్రి విడదల రజనీ (Vidadala Rajani)ని మళ్లీ జగన్ నియమించడంతో మర్రి రాజశేఖర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గుంటూరులో భారీ మెజారిటీతో ఓడిన ఆమెకు తిరిగి బాధ్యతలు అప్పగించడంపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాలకు సైతం కొన్ని రోజులుగా మర్రి రాజశేఖర్ దూరంగా ఉంటున్నారు. తాజాగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జగన్ కు షాకిచ్చారు.

విజయసాయిరెడ్డి గుడ్ బై
వైకాపాలో జగన్ తర్వాత ఆ స్థాయిలో బాగా వినిపించిన పేరు విజయసాయిరెడ్డి (Vijayasai Readdy). జగన్ కేసులతో పాటు అధికారం చెలాయించడంలో విజయసాయిరెడ్డి భాగస్వామిగా ఉంటూ వచ్చారు. అటువంటి ఆయన ఇటీవల వైకాపాను వీడి అందరికీ ఊహించని షాకిచ్చారు. అంతేకాదు ఇటీవల ఏపీ సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి.. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు. ఆయన మారిపోయారంటూ వ్యాఖ్యానించారు. జగన్ మనసులో తనకు స్థానం లేకపోవడంతో పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

జనసేనలోకి బాలినేని
ప్రకాశం జిల్లాలో వైసీపీకి వెన్నెముకగా నిలుస్తూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) సైతం ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వైఎస్ కుటుంబంతో బాలినేనికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో జగన్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన మెుదటి కేబినేట్ లో బాలినేనికి చోటు కల్పించారు. ఆ తర్వాత మంత్రి వర్గ పునఃవ్యవస్థీకరణలో భాగంగా బాలినేని తన మంత్రి పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తితో ఉంటూ వచ్చారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బాలినేని పార్టీని వీడతారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. ఈ క్రమంలో ఎన్నికల్లో జగన్ పార్టీ 11 స్థానాల్లో మాత్రమే గెలిచి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే బాలినేని వైకాపాకు రాజీనామా చేశారు. జగన్ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు బహిరంగంగా ప్రకటించారు.

Also Read: CM Chandrababu – Bill Gates: ఏపీ తలరాతను మార్చే గొప్ప భేటి.. అభివృద్ధి పరుగులు పెట్టాల్సిందే!

నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా
మాజీ మంత్రి మర్రి రాజశేఖర్ కంటే నలుగురు ఎమ్మెల్సీలు వైకాపాకు గుడ్ బై చెప్పారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం గతేడాది డిసెంబర్ లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అతడు ప్రకటించిన కొద్ది గంటల్లోనే వైసీపీ నేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సైతం పార్టీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు వారిద్దరు పార్టీ నేత జగన్ కు లేఖలు పంపారు.

త్వరలో మరికొంత మంది!
వైసీపీలో రాజీనామాల పర్వం మరిన్ని రోజులు కొనసాగనున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొంత మంది ముఖ్యనేతలు సైతం పార్టీని వీడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ వైసీపీ ఖాళీ అవుతోంది. ఆ పార్టీకి చెందిన కార్పోరేషన్ ఛైర్మన్లు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు ప్రతీ రోజూ ఏదోక ప్రాంతంలో ఆ పార్టీని వీడి కూటమి పార్టీల్లోకి చేరుతున్నారు. మరోవైపు పార్టీని నాయకులు వీడుతుండటంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. పార్టీని వీడవద్దని తమ నేతలకు సూచిస్తున్నారు. అటు జగన్ సైతం వలసల విషయంలో ఆందోళనలో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు