స్పోర్ట్స్

Suryakumar-IPL 2025: ముంబై కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్

Suryakumar-IPL 2025: ఎలా అంచనా వేసుకుందో తెలియదు.. ఎందుకు చేసిందో అర్థం కాదు.. కానీ ..గతేడాది ముంబై ఇండియన్స్ టీమ్ అనూహ్య నిర్ణయం ప్రకటించి అందరినీ విస్మయానికి గురి చేసింది. అదీ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి బై బ్యాక్ చేసుకుని కెప్టెన్ చేయడం సంచలనంగా మారింది. అప్పటికే టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతూ.. ముంబై జట్టుకు 5 ట్రోఫీలు గెలిపించి పెట్టిన రోహిత్ శర్మను కాదని ..పాండ్యాను కెప్టెన్ గా చేశారు.

దీంతో జట్టు అమాంతం అతిపెద్ద కుదుపునకు లోనైంది. జట్టులో రోహిత్ అనంతరం సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా  కెప్టెన్ కావాలని కోరుకున్నారు. కానీ వీరిని కాదని..పాండ్యాను ఏరి కోరి తెచ్చుకున్నారు. దీంతో అక్కడ గుజరాత్ టైటాన్స్ ..ఇక్కడ ముంబై ఇండియన్స్ టీమ్ సఫరయ్యాయి. అంతేకాదు ఏడాది కాలంలో సీన్ మొత్తం మారింది.

రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీలను దేశానికి అందించి గొప్ప కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. అదే ముంబై జట్టులోని సూర్యకుమార్ యాదవ్ టీమిండియా టీ20 కెప్టెన్ ఎంపికయ్యాడు. ఇక బుమ్రా ఏకంగా టెస్టు జట్టు ఫ్యూచర్ కెప్టెన్ గా చేయాలని అనుకుంటున్నారు. అంతేకాదు రోహిత్ విశ్రాంతి తీసుకున్నసిడ్నీ టెస్టుతో పాటు ఆసీస్ బిజిటిలో భాగంగా జరిగిన తొలి టెస్టులో కూడా జట్టును నడిపించాడు. అంతేకాదు అడిలైడ్ టెస్టులో అద్భుత విజయం అందించాడు.

ఇదంతా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసిన ఏడాదిలోనే జరగడం విశేషం. అప్పుడు ముంబై ఇండియన్స్ మేనేజ్ మెంట్ ఏమాత్రం ఊహించలేదు. రోహిత్ ఇంత విజయవంతమైన సారథిగా నిలుస్తాడని.. సూర్యకుమార్ యాదవ్, బుమ్రా సైతం టీమిండియా కెప్టెన్లుగా ఎంపికవుతారని అనుకోలేదు.

ఇక మరో ట్విస్ట్ ఏమిటంటే .. ఈ విజయాల్లో హార్దిక్ పాండ్యా కూడా కీలకపాత్ర పోషించడం.. సూర్య కెప్టెన్సీలోనూ.. రోహిత్ కెప్టెన్సీలోనూ హార్దిక్ ఆడడమే కాదు.. విజయాలు అందించాడు. దీంతో ఏడాది కాలంగా నెలకొన్న మంచుతెర వీడినట్లైంది. జట్టుగా ఆడి ప్రపంచకప్ విజేతగా నిలిచిన పాండ్యాను సైతం ముంబై ఫ్యాన్స్ ఇప్పుడు కెప్టెన్ గా ఓన్ చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో ముంబై యాజమాన్యం సహా వారి టీమ్ మేనేజ్ మెంట్ యమా హ్యాపీగా కనిపిస్తోంది.

Also Read: Punjab Kings – Shreyas Iyer: శ్రేయస్ రాకతో రాత మారనుందా..?

కాగా ఈ నెల 23న చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలో జరిగే తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్యా దూరమయ్యాడు. గత సీజన్ లో ముంబై జట్టు .. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నిబంధనను  మూడోసారి కూడా అతిక్రమించింది. దీంతో నిబంధనల ప్రకారం జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా మ్యాచ్ సస్పెన్షన్ తో పాటు   పాండ్య 30 లక్షల జరిమానా పడింది. అంతేకాదు  ప్లేయర్లకు రూ. 12 లక్షలు జరిమానా విధించారు.

కాగా, ముంబై జట్టు ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై కాకపోవడంతో ఈ సీజన్ తొలి మ్యాచ్ నుంచి పాండ్యా తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా పాండ్య స్థానంలో  టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ ముంబై ఇండియన్స్  జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్ భారత జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. అందుకే  ఐపీఎల్ 2025 సీజన్‌లో మాజట్టు ఆడే  తొలి మ్యాచ్‌కు అతడే కెప్టెన్ అని పాండ్య తెలిపాడు. గత సీజన్ లో ముంబై జట్టు కేవలం నాలుగు మ్యాచ్ ల్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు