Thieves Hulchul Chevella
క్రైమ్

Crime News: చేతిలో కత్తులు.. ముఖాలకు ముసుగులు.. అర్ధరాత్రి దొంగల హల్చల్.

చేవెళ్ల  స్వేచ్ఛ:Crime News: చేవెళ్ల మండల పరిధిలోని సింగప్పగూడ, న్యాలట గ్రామాల్లో సోమ వారం అర్ధరాత్రి దొంగలు హల్‌ చల్‌ చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనలకు సంబంధించి ఎస్ఐ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సింగప్పగూడ గ్రామానికి చెందిన అంజిరెడ్డి (44) ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 1 గంటకు మెలకువ వచ్చింది. బయటకు వెళదాం అనుకుంటే బయట నుంచి గడియ పెట్టారని గమనించి తన కుమారుడు మొలుగు అంజిరెడ్డికి ఫోన్‌ చేసి విషయం చెప్పాడు.

అతను వచ్చి తలుపులు తీసి.. పక్కన ఉన్న రూమ్‌కి వెళ్లి చూడగా అల్మారా పగులగొట్టి అందులో ఉన్న రూ.8 వేలను దొంగలు అపహరించి నట్లు అర్థమైంది.  అదేవిధంగా న్యాలట గ్రామానికి చెందిన ఒగ్గు నాగయ్య (65) తన భార్యతో కలిసి తన అత్తగారింటి వెళ్లారు. పొరుగు ఇంటి వారు మంగళవారం ఉదయం నాగయ్యకు ఫోన్‌ చేసి మీ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. తాళం విరగ్గొట్టి ఉన్నదని సమాచారం ఇచ్చారు.

Also Read: DK Aruna: ఎట్టకేలకు దొంగ దొరికాడు.. నేర చరిత్ర పెద్దదే.

వారు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని రూ.10 వేల నగదు కనిపించలేదు. న్యాలట గ్రామంలోని కొందరి ఇండ్లల్లో కూడా దొగలు చొరబడ్డారని గ్రామస్తులు వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
ముఖాలకు ముసుగు.. కత్తులు, రాడ్లతో సంచారం..

దుండగులు ముఖాలకు ముసుగు వేసుకొని.. కత్తులు, రాడ్లు పట్టుకొని సంచారం చేశారు. రెండిండ్లలో చోరీ చేసిన వాళ్లు మూడో ఇంట్లో దొంగతనం చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ సీసీ కెమెరాలు ఉండడంతో వెనుదిరిగారు. ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్దకు వస్తున్న దృశ్యాలు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. రామన్నగూడ గ్రామంలోనూ బైక్‌ను ఎత్తుకెళ్లారు. దొంగలు దర్జాగా సంచరిస్తుండడంపై స్థానికులు భయం భయంగా గదువుతున్నారు. పోలీసుల పహార, గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

Also Read: AP Crime: కన్న బిడ్డలనే కాలువలోకి తోసిన తండ్రి.. 7ఏళ్ల కూతురు మృతి.. ఏపీలో ఘటన

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!