sreyas, ricky
స్పోర్ట్స్

Punjab Kings – Shreyas Iyer: శ్రేయస్ రాకతో రాత మారనుందా..?

పంటర్.. అయ్యర్ కాంబినేషన్ లో

పంజాబ్ ‘‘కింగ్స్’’ అయ్యేనా..?

Punjab Kings – Shreyas Iyer: అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా.. పంజాబ్ కింగ్స్ ట్రోఫీ దక్కించుకోలేకపోతోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి  ఇప్పటివరకు దండయాత్రలు కొనసాగిస్తున్నా ట్రోఫీ చేజిక్కలేదు. ఫ్యాన్ బేస్ అంతగా లేదు.. స్టార్ హోదా దక్కలేదు. పంజాబ్ కింగ్స్ అంటే ప్రీతి జింతా  అన్నట్లుగా మారిన పరిస్థితి. అయితే ఈ మెగా వేలంతో పంజాబ్ కింగ్స్ పూర్తిగా మారింది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ..పూర్తిస్థాయిలో కొత్త జట్టుగా మారింది. ఇప్పటిదాకా ఒకలెక్క..ఇప్పటి నుంచి మరో లెక్కన్నట్లుగా..ఐపీఎల్ లో అద్భుతాలు చేయాలని ఆశిస్తోంది.

అన్నీ కుదిరినా.. కప్పు మాత్రం రావడం లేదు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ గా ఉన్న పేరును  పంజాబ్ కింగ్స్ గా మార్చినా.. కొత్తగా కెప్టెన్లను ప్రయత్నించినా..ఫలితం మాత్రం కానరావడం లేదు. 2008లో సెమీస్ స్థానం..మళ్లీ 2014లో ఫైనల్ ..అంతే ఇక ఆ తర్వాత ఒక్కసారీ లీగ్ దశ దాటింది లేదు. ప్లేఆఫ్ చేరింది లేదు. కానీ ఈసారి జట్టు పూర్తిగా మారిపోవడం..గతేడాది కోల్ కతాకు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కావడంతో వారిలో మళ్లీ టైటిల్ ఆశలు చిగురించాయి.

అయ్యర్ బలం..ఆల్ రౌండర్లతో దుర్భేద్యం..

మరోమాటకు తావులేకుండా ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టుకు  కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ అతిపెద్ద బలం.  టీ20 గేమ్ లో మిడిలార్డర్ లో అద్భుతంగా రాణించగలడు. అంతేకాదు .. స్పిన్నర్లను ధాటిగా ఎదుర్కోగలడు. గేమ్ లో గేర్ మార్చి భారీషాట్లతో విరుచుకుపడగలడు. గతంలో కోల్‌కతా జట్టులో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా అతను అదరగొట్టిన సంగతి తెలిసిందే. అందేకాదు ఇటీవల సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలవడవంలో మిడిలార్డర్ లో అతను పోషించిన కీలకపాత్రనే ప్రధానం.  ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నుంచి మిగిలిన ప్లేయర్లు  స్ఫూర్తి పొందుతారని పంజాబ్ యాజమాన్యం అనుకుంటోంది. ఇక జట్టులో  ఆసీస్ సూపర్ ఆల్ రౌండర్లు స్టాయినిస్, మాక్స్ వెల్ సహా యాన్సెన్, అజ్మతుల్లా ఉన్నారు. ఇక జోస్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, బార్ట్ లెట్ లాంటి హార్డ్ హిట్లర్లు ఉన్నారు. ఫెర్గూసన్‌ లాంటి సూపర్ ఫాస్ట్ బౌలర్ కూడా ఆ జట్టులో రాణించే సత్తా ఉంది.  మేటి ఇక  భారత ప్లేయర్లలో ఇటీవలి కాలంలో టీ20ల్లో అద్భుత ఫాంతో ఉన్న పేసర్  అర్ష్‌దీప్, ఇక భారత లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ లతో పంజాబ్ కింగ్స్ దుర్బేద్యంగా కనిపిస్తోంది. ఇక ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ ఓపెనింగ్ లో అదరగొడితే.. వధేరా లాంటి ఆల్ రౌండర్, వైశాఖ్ విజయ్ కుమార్, యశ్ ఠాకూర్ లాంటి పేసర్లు.. కింగ్స్ కు బలం. 24 ఏండ్ల నేహల్ వధేరా (రూ.4.20 కోట్లు, పంజాబ్) కూడా ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టాడు.  ఈసారి సొంత రాష్ట్రం పంజాబ్  తరఫున ఆడుతున్న అతడికి ఎక్కువ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. అంతేకాదు అతను భారీషాట్లు ఆడగల దిట్ట. మంచినీళ్లు తాగినంత సులువుగా సిక్సర్లు సంధించగలడు. అందుకే అన్ క్యాప్ డ్ ప్లేయర్ అయినా మంచి రేటుకు పంజాబ్ కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది.

స్వదేశీ లేకపోవడమే బలహీనత..

విదేశీ ప్లేయర్లు అద్భుతంగా కనిపిస్తున్నా పంజాబ్ కింగ్స్ జట్టుతో టీమిండియా లోకల్ ప్లేయర్లు లేకపోవడం అతిపెద్ద మైనస్. శ్రేయస్ అయ్యర్, అర్షదీప్, చాహల్ కాకుండా ఎవరూ స్టార్ ప్లేయర్లు లేదు. గతేడాది పంజాబ్ జట్టులో అద్భుత బ్యాటింగ్ తో శశాంక్ సింగ్ దుమ్ము రేపాడు. సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్ ఫినిషర్ గా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. మరి ఈ ఏడాది అతను ఎలా రాణిస్తాడో చూడాల్సిందే. చాహల్ కు తోడుగా మరో స్పిన్నర్ అందుబాటులో లేడు. అర్షదీప్ తో పాటు మరో లోకల్ పేసర్ ఉంటే పంజాబ్ కింగ్స్ టీమ్ కాంబినేషన్ అద్భుతంగా ఉండేది. ఇక ఎన్ని బలాలున్నా..పంజాబ్ కింగ్స్ జట్టుగా ఆడడంలో సక్సెస్ కాలేకపోతుంది. ఈ లోపాన్ని శ్రేయస్‌ అయ్యర్ సరిదిద్దడం పైనే పంజాబ్ విజయాలు ఆధారపడిఉన్నాయి.  విదేశీ బలాలు ముఖ్యంగా మ్యాక్స్‌వెల్‌  ఎలా ఆడుతాడో తెలియదు. మిగిలిన ప్లేయర్లు రాణించడంలో తడబడితే మళ్లీ పరాజయాలు పలకరించడం ఖాయం.

ప్రీతి జింటా  జోరుగా..హుషారుగా..

బాలీవుడ్ స్టార్  ప్రీతి జింటా..  ప్రతి సీజన్ ఐపీఎల్ లో పంజాబ్ జట్టును ఉత్సాహపరుస్తూ..మైదానంలో తన జోష్ తో మైమరిపిస్తుంది. జట్టు గెలిస్తే హగ్గులు ఇవ్వడం ఈ సొట్టబుగ్గల ప్రీతికి అలవాటు.  2008లో పంజాబ్ ఫ్రాంచైజీకి యజమానిగా జట్టు విజయం సాధించినా లేక ఓడినా ప్లేయర్లను ప్రోత్సహించడంలో ముందుంటుంది. అసలు ప్రీతి జింటా తన చిరునవ్వుతోనే స్టేడియంలో మరింత ఎనర్జీని రప్పిస్తుంది. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా..ఈ సీజన్‌లోనూ, ఆమె స్టేడియంలో జట్టు కోసం నిబద్ధతతో, ఉత్సాహంతో కనిపించడం ఖాయం.

పంజాబ్ కింగ్స్ జట్టు:  శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, జోస్‌ ఇంగ్లిస్, స్టాయినిస్, మ్యాక్స్‌వెల్, శశాంక్‌ సింగ్, నెహాల్‌ వదేరా, అర్ష్‌దీప్‌ సింగ్, చాహల్, వైశాఖ్‌ విజయ్‌కుమార్, మార్కో యాన్సెన్, అజ్మతుల్లా, ఆరోన్‌ హార్డీ, లాకీ ఫెర్గూసన్, బార్ట్‌లెట్‌, యశ్‌ ఠాకూర్, విష్ణు వినోద్, హర్నూర్‌ పన్ను, పైలా అవినాష్, హర్‌ప్రీత్‌ బ్రార్, ప్రియాంశ్‌ ఆర్య, ముషీర్‌ ఖాన్, సూర్యాంశ్‌ షెగ్డే, కుల్‌దీప్‌ సేన్, ప్రవీణ్‌ దూబె

Also Read: KKR – IPL: కేకేఆర్ మళ్లీ మేజిక్ చేస్తుందా..?

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?