AP MLAs MLCs
ఆంధ్రప్రదేశ్

AP MLAs MLCs: ఓడిన హోమ్ మంత్రి.. గెలిచిన మరో మంత్రి.. అసలు విషయం ఇదే!

విజయవాడ, స్వేచ్ఛ: AP MLAs MLCs: విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల స్పోర్ట్స్‌ మీట్‌ ఎంతో సందడిగా సాగుతోంది. క్రీడల్లో భాగంగా క్రికెట్‌ పోటీలను అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సరదాగా కాసేపు అయ్యన్న బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి, ప్రజాప్రతినిధుల్లో ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు క్రీడల్లో భాగంగా నిర్వహించిన ‘టగ్ ఆఫ్ వార్’ పోటీలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీలో పురుష సభ్యులపై మహిళా నేతల బృందం విజయం సాధించింది. ఎంతో సందడిగా ఈ ఆటలు సాగాయి.

Also Read: TTD News: శ్రీవారి దర్శన టికెట్ల జారీలో మార్పులు.. కీలక ప్రకటన జారీ చేసిన టిటిడి..

ఓడిన హోం మంత్రి..
ప్రజాప్రతినిధుల ఆటల పోటీల్లో హోం మంత్రి వర్సెస్ గిరిజన శాఖ మంత్రి బృందం మధ్య పోటీ నెలకొంది. టగ్ ఆఫ్ వార్ పోటీ‌లో హోం మంత్రి బృందంపై గెలిచిన మంత్రి సంధ్యారాణి బృందం గెలిచింది. మరోవైపు మంత్రి అచ్చెన్నాయుడు వర్సెస్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి బృందం మధ్య పోటీ నెలకొన్నది. ఈ టగ్ ఆఫ్ వార్ పోటీలో బుచ్చయ్య బృందం గెలిచింది.

ఫోన్లు వద్దు!
ఈ మూడ్రోజులూ ఫోన్లు పక్కనపెట్టి సరదాగా ఆటల్లో పాల్గొందామని ప్రజాప్రతినిధులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. సాంస్కృతిక పోటీల్లో డైలాగ్ చెప్పిన ఎన్టీఆర్‌కే మొదటి బహుమతి దక్కిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గణబాబు వాలీబాల్ జాతీయ జట్టుకు ఆడారని, తాను జిల్లా జట్టుకు ఆడిన అలనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.

Also ReadL: TDP Alliance govt: వైసీపీకి బిగ్ షాక్.. ఆ ఒక్కటి వదలని కూటమి..

క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని స్పీకర్ సూచించారు. మంత్రి మండిపల్లి మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యాక క్రీడలకు ప్రోత్సాహం పెరిగిందన్నారు. క్రీడా పోటీల్లో పాల్గొంటున్న ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. సభాపతి అయ్యన్న మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని, సభ్యుల మానసిక ఆనందం కోసం అప్పట్లో ఎన్టీఆర్ ఆటలు ప్రారంభించారని శాప్ ఛైర్మన్ రవినాయుడు తెలిపారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https:https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!