CM Revanth Reddy
తెలంగాణ

CM Revanth Reddy: ఆ ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్న సీఎం.. వెయిట్ అంటూ సూచన

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: CM Revanth Reddy: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఓవైపు బడ్జెట్ చర్చ వేడెక్కిస్తుండగా, మరోవైపు మంత్రివర్గ విస్తరణ చర్చ కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటై ఏడాదిన్నర అవుతున్నా గిరిజన నేతలకు ఇప్పటికీ క్యాబినెట్‌లో ప్రాధాన్యత దక్కలేదని ఎమ్మెల్యే బాలూ నాయక్ మీడియాతో చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. వరుసగా రెండో రోజు ఈ రకమైన కామెంట్స్ ను కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ చేయటం ఆసక్తికరంగా మారింది.గత ప్రభుత్వంలో మాత్రం గిరిజన నేతలకు క్యాబినెట్ లో చోటు దక్కిందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Also READ: CM Revanth Reddy: తెలంగాణ బాటలో యావత్ దేశం.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్ కదూ

గత సర్కారులో అవకాశముండేది – ఇప్పుడు క్లారిటీ లేదు

గత కేసీఆర్ సర్కారులో ప్రతీసారి గిరిజన నేతలకు మంత్రిపదవి లభించేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చి 15 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ క్యాబినెట్‌లో గిరిజన నేతలకు చోటుపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. తమ సామాజిక వర్గానికి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం అవసరమని, దీనిపై అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

MLA Sudheer Reddy: ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ కేసు.. మహిళ కార్పొరేటర్ పై ఆ వ్యాఖ్యలేంటి సార్..

సీఎం ఫైర్, వార్నింగ్ ఇచ్చిన రేవంత్.

ఈ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లిన తర్వాత, ముఖ్యమంత్రి బాలూ నాయక్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తక్షణమే వారిని చాంబర్‌కు పిలిపించి, ఈ తరహా వ్యాఖ్యలు మంత్రివర్గంలో అసౌకర్యానికి దారి తీస్తాయని వార్నింగ్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడరాదని స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది.

నోరు జారడంపై సిఎం ఆగ్రహంతో – వివరణ ఇచ్చుకున్న బాలూ నాయక్

బాలూ నాయక్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీయటంతో, ఆయన తన వైఖరిని సమర్థించుకుంటూ వివరణ ఇచ్చినట్లు సమాచారం. తమ వర్గానికి న్యాయం జరిగేలా చూడాలన్న ఉద్దేశంతోనే తన వ్యాఖ్యలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటం, కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవటంతోనే తాను అలా మాట్లాడినట్లు ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ తో పాటు, ఢిల్లీ పెద్దలను ఎలా ప్రభావితం చేస్తాయనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.మొత్తానికి మంత్రివర్గ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండటంతో, అసలు విస్తరణ ఎప్పుడు ఉంటుంది, ఉంటే గిరిజన నేతలకు అవకాశం కల్పిస్తారా లేదా అనేది వేచిచూడాలి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https:/https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ