MLA Sudheer Reddy: ఎల్బీనగర్(LB Nagar) బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి హస్తినాపురం కార్పొరేటర్(Hastinapur Corporator) బానోతు సుజాత నాయక్(Banothu Sujatha Naik) కు మధ్య సోమవారం చెలరెగిన వివాదం మరో రూపం తీసుకుంది. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడ(Proto call)తో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారుతోంది. తాజాగా సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు(Sc St Atrocity Case) నమోదు అయింది. తనపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రోటోకాల్ వివాదం..
ఈనెల 12న ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని మన్సురాబాద్ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే అవే పనులకు సోమవారం(18వ తేదీ) బీజేపీ కొప్పుల నర్సింహారెడ్డి తిరిగి శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయినా వేరే చోట శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుండగా మరోసారి బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిన పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
ఈ క్రమంలో కార్యకర్తకలు గాయాలవడంతో సుధీర్ రెడ్డి పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్లను తీసుకొని డీసీపీ ఆఫీసుకి వెళ్లి పోలీసు అధికారులతో జరిగింది వివరించారు. అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడుల వెనుక మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) ప్రమేయం ఉందని ఆరోపించారు. అటు పై మహిళా కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ పైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించారు. ఆమె వెంటనే మహిళ కమిషన్ ను ఆశ్రయించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మహిళా కమిషన్(Women Commission) చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ళ శారద గారిని కలసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. కమిషన్ ముందు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ మహిళా కార్పొరేటర్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమంటే మహిళా లోకాన్ని అగౌరవ పరచడమే అంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బ్యాడ్ కామెంట్స్
రాజకీయ నాయకులు అన్నాక కాస్త తోలు మందం ఉండాలి. ఎంత ఆగ్రహం వచ్చిన ఆపుకోగలగాలి. లేకపోతే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి. ప్రోటోకాల్ లో ఏదైనా వివాదం ఉంటే తేల్చుకోవాలి. అంతేగాని మహిళ కార్పోరేటర్ ను అదునా ఎస్టీని పట్టుకుని ఇంకో నేతతో సంబంధం అంటగట్టి మీడియా ముందే మాట్లాడటం ఎంతవరకు సమంజసమో.. సుధీర్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఆయన అన్నమాటకు సుజాత కమిషన్ ముందు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ పార్టీ కార్యకర్తలు గాయపడినందుకే సుధీర్ రెడ్డికి ఇంత కోపమొచ్చిందో లేక ఇంకేమైనా ఉందో తెలియదు కానీ ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం కరెక్టు కాదు. మరోవైపు ఆయనది కాంగ్రెస్ బ్యాగ్రౌండ్. 2018 వరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. మరీ కాంగ్రెస్ నేతలపై అదీ మహిళ నేతలపై అలా అనుచిత వ్యాఖ్యలు చేయడం అహంకారం అని తప్పా ఇంకోమాట అనలేం.
Also Read: Greater Warangal: మాయమాటలతో బాలికల ట్రాప్.. ముఠా గుట్టురట్టు