తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: CM Revanth Reddy: రెండు రోజుల వ్యవధిలో బీసీ రిజర్వేషన్లు (కులగణణ), ఎస్సీ వర్గీకరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం లభించడంతో తెలంగాణ కార్యాచరణకు ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది. ఈ రెండూ చరిత్రాత్మకమైన అంశాలను వివిధ పార్టీల సభ్యలు ముఖ్యమంత్రిని అభినందించారు. కులగణన సర్వే ద్వారా బీసీల లెక్క 56.36 శాతంగా తేలడంతో విద్య, ఉద్యోగ రంగాలతో పాటు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌కు చట్టబద్ధత లభించింది. ఎస్సీల్లోని 59 కులాలు మూడు గ్రూపులుగా వర్గీకరణకు నోచుకోవడంతో 15% రిజర్వేషన్ బ్రేకప్ ఫార్ములా రూపొందింది. ఈ రెండూ ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రం చేయకపోవడంతో తెలంగాణ ఆదర్శనీయంగా మారింది. ఈ రెండు సెక్షన్ల ప్రజలకు మూడు చట్టాలు (బీసీ రిజర్వేషన్లకు రెండు చట్టాలు, ఎస్సీ వర్గీకరణకు ఒకటి) దిక్సూచిగా, భరోసాగా మారాయి.
Also Read: TG 10th Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షకు సర్వం సిద్ధం..
ఈ రెండు అంశాలతో ఇతర రాష్ట్రాల చూపు తెలంగాణవైపు మళ్లింది. ఇప్పటికే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కులగణన చేసినా అవి కొలిక్కిరాలేదు.. చట్టరూపం దాల్చలేదు. కానీ సరిగ్గా ఏడాది వ్యవధిలోనే తెలంగాణ ఆలోచన మొదలు ఆచరణ వరకు మొత్త ప్రక్రియ పూర్తయ్యి చట్టం ఉనికిలోకి వస్తున్నది. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టు 1న తీర్పు వెలువరించిన తర్వాత ఎనిమిది నెలల వ్యవధిలోనే తెలంగాణ దాన్ని కొలిక్కి తీసుకొచ్చింది. అమలు చేయబోయే రాష్ట్రంలో దేశంలోనే తెలంగాణకు క్రెడిట్ దక్కింది. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నా దానికి చట్టబద్ధత కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుండడంతో జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్‌కు పొలిటికల్ మైలేజ్ వచ్చినట్లయింది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకు బీసీ, ఎస్సీ సంఘాలకు అస్త్రంగా మారనున్నది.
వ్యక్తిగతంగా రాహుల్, రేవంత్‌కు ప్రశంసలు :
కులగణన రాహుల్‌గాంధీ ‘బ్రెయిన్ చైల్డ్’కాగా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైన వ్యూహంతో చట్టం స్థాయికి తీసుకురావడంతో వీరిద్దరికీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించినట్లయింది. వివిధ పార్టీల దృష్టి వీరిద్దరిపై పడింది. ఇప్పటికే సీఎంకు వివిధ పార్టీల నుంచి అభినందనలు రాగా రాహుల్‌గాంధీకి సైతం ఉత్తరాది రాష్రాల్లోని ప్రాంతీయ పార్టీల నుంచి ప్రశంసలు వచ్చినట్లు పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల హామీలకే పరిమితం చేయకుండా వాటి ఫలాలు ప్రజలకు అందేలా కార్యరూపం దాల్చడం కాంగ్రెస్ నిబద్ధతకు, చిత్తశుద్ధికి నిదర్శనమే చర్చలూ మొదలయ్యాయి. ఈ రెండు అంశాలతో ఆయా సెక్షన్ల ప్రజల్లోని సంతోషం కాంగ్రెస్‌కు నైతికంగా మద్దతుగా మారే అవకాశమున్నది. అనివార్యంగా ఇతర పార్టీలు సైతం ఈ రెండు అంశాలకు మద్దతు ఇవ్వక తప్పలేదు.
Also READ: Social Media Influencers: బెట్టింగ్ భూతం.. అసలు సూత్రధారులెవరు? వీరు నోరు విప్పేనా?
ఇతర రాష్ట్రాలు కులగణన, వర్గీకరణ విధానాలను టేకప్ చేయాలంటే తెలంగాణ అనుసరించిన విధానాలు, రూపొందించుకున్న మార్గదర్శకాలు, సర్వేకు అనుసరించిన శాస్త్రీయ పద్ధతి, ఎదురైన సవాళ్ళను అధిగమించిన తీరు, ఏకసభ్య కమిషన్‌ల ఏర్పాటు, న్యాయ నిపుణుల సలహాలు, ముసాయిదా బిల్లుల రూపకల్పన, చట్టసభల్లో జరిగిన చర్చలు, ఇతర పార్టీల అభిప్రాయాలు.. ఇవన్నీ అధ్యయన అంశాలుగా మారనున్నాయి. ఇక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపే పరిస్థితి నెలకొనే అవకాశాలున్నాయి. బీసీ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ చట్టసభలు ఆమోదించిన చట్టాలకు పార్లమెంటు ద్వారా రాజ్యాంగ సవరణ చేసి లీగల్ చిక్కులకు ఆస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం బాల్ బీజేపీ కోర్టులో ఉన్నది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://https://epaper.swetchadaily.com// లింక్ క్లిక్ చేయగలరు