Telangana Budget 2025: తెలంగాణ బడ్టెట్.. కేబినేట్ తో సీఎం రేవంత్ కీలక సమావేశం | Telangana Budget: తెలంగాణ బడ్టెట్.. కేబినేట్ తో సీఎం రేవంత్ కీలక సమావేశం
Telangana Budget 2025
Telangana News

Telangana Budget 2025: తెలంగాణ బడ్టెట్.. కేబినేట్ తో సీఎం రేవంత్ కీలక సమావేశం

Telangana Budget 2025: తెలంగాణ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బుధవారం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి వచ్చిన భట్టి (Bhatti Vikramarka)కి మంత్రులు శ్రీధర్ బాబు (Sridhar Babu), పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), జూపల్లి కృష్ణారావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు ఘన స్వాగతం పలకారు. ఈ సందర్భంగా వారితో ఆర్థిక మంత్రి భట్టివిక్రమార్క కొద్దిసేపు ముచ్చటించారు. ఉ.11.14 నిమిషాలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

కేబినేట్ ఆమోదం

నేడు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో తెలంగాణ కేబినేట్ (Telanagana Cabinate)కీలక సమావేశం ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన ఈ భేటి జరిగింది. బడ్జెట్ లోని అంశాలు, పథకాలకు కేటాయింపులు తదితర అంశాలపై ఈ సమావేశంలో కేబినేట్ చర్చించింది. అనంతరం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రతులకు కేబినేట్ ఆమోదం తెలిపింది.

కేసీఆర్ దూరం

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరపున కేటీఆర్, హరీష్ రావు బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన సభలో ప్రాతినిథ్యం వహించనున్నారు.

బడ్జెట్ ప్రాధాన్యతలు?

రూ.3.20 లక్షల కోట్లతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. బడ్టెట్ కేటాయింపుల్లో ఆరు గ్యారెంటీలకు పెద్ద పీట వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాటితో పాటు రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ అభయ హస్తం, ఉచిత బస్సు, రూ.500 సిలిండర్, గృహజ్యోతి తదితర పథకాలు, హామీలకు నిధుల కేటాయింపు చేయనున్నారు. అలాగే మహిళా శక్తి పథకం, రాజీవ్ యువ వికాసం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణంకోసం నిధులు కేటాయించే అవకాశముంది.

Also Read: Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ కు సర్వం సిద్ధం.. కేటాయింపులు పూర్తి?

హైదరాబాద్ కు వరాల జల్లు!

2026 ఫిబ్రవరి లో హైదరాబాద్ జీహెచ్ఎంసీ కౌన్సిల్ పదవీ కాలం ముగియనుండటంతో, ఆ తర్వాత ఏడాది కాలంలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీకి నిధుల కేటాయింపులుంటాయా? అన్న చర్చ జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అభివృద్దిని పరుగులు పెట్టించాలన్న వ్యూహాంతోనే సర్కారు వర్తమాన సంవత్సరంలో జరిపిన విధంగా వేల కోట్లలో కేటాయింపులు జరిపే అవకాశాలున్నాయి.

ఇవి కూడా చదవండి

Sunita Williams: సునీతా విలియమ్స్.. విజయం వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు?

TG 10th Exams: తెలంగాణలో టెన్త్ పరీక్షకు సర్వం సిద్ధం..
Social Media Influencers: బెట్టింగ్ భూతం.. అసలు సూత్రధారులెవరు? వీరు నోరు విప్పేనా?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క