They Are The Reason For Rcbs Defeat
స్పోర్ట్స్

Ambati Rayudu: అందుకే గెలవట్లేదని అంబటి సంచలన వ్యాఖ్యలు

They Are The Reason For Rcbs Defeat: ఆ జట్టు నిండా స్టార్ ప్లేయర్లే. ప్రతి సీజన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంటుంది. ఏ ఫ్రాంచైజీకి లేనంతగా ఈ జట్టుకి లాయల్ ఫ్యాన్స్ సొంతం. ఈ సాలా కప్ మనదే అంటూ ఏటా కొత్త ఉత్సాహంతో వస్తుంటుంది. కానీ రిజల్ట్ మాత్రం జీరో. 16 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగానే మిగిలింది ఆ టీమ్‌కి. ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇదంతా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గురించి అని. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్‌సీబీ పేలవ ప్రదర్శన చేస్తోంది.

ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించింది. ఈ సీజన్‌లో తక్కువ స్కోరుకు ఆలౌటైన ఏకైక జట్టుగా హోమ్‌‌ గ్రౌండ్‌లో రెండు ఓటములు చవిచూసిన టీ‌మ్‌గా బెంగళూరు ఇప్పటికే చెత్త రికార్డుని నెలకొల్పడంతో అందరూ విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండో ప్లేస్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆర్‌సీబీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు ట్రోఫీ సాధించకపోవడానికి గల రీజన్స్‌ను వివరించాడు. ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఫ్లాప్ అవ్వుతూ జూనియర్ క్రికెటర్లపై భారాన్ని పెంచడమే ఆర్‌సీబీ ఓటములకు మెయిన్‌ రీజన్‌ అని రాయుడు అభిప్రాయపడ్డాడు.

Also Read: మ్యాచ్ ఎఫెక్ట్‌..! టీమ్‌ మొత్తానికి ఫైన్‌

సీనియర్లంతా టాప్ ఆర్డర్‌లో ఉంటారని, లోయర్ ఆర్డర్‌లో ఉండేది జూనియర్లే అని అన్నాడు. అలాగే పేలవమైన బౌలింగ్ మరో రీజన్‌ అని తెలిపాడు. ఆర్‌సీబీ బౌలర్లు ఎప్పుడూ ధారాళంగా రన్స్‌ సమర్పిస్తుంటారు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లు మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయరు. మెయిన్‌గా ఇంటర్నేషనల్‌ ఆటగాళ్లు. ఒత్తిడి టైంలో వాళ్లంతా బ్యాట్లు ఎత్తేస్తుంటారు. అప్పుడు భారాన్ని మోసేది భారత యువ బ్యాటర్లే. గత 16 సీజన్లలో ఇదే రిపీట్ అవుతుంది.కీలక సమయాల్లో స్టార్ ఆటగాళ్లు తడబడుతూ ఉంటారు. అంతేగాక ప్రధాన ఆటగాళ్లంతా టాప్ ఆర్డర్‌లోనే ఉంటారు. మిడిల్, లోయర్ ఆర్డర్‌లో జూనియర్లే ఉంటారు. దీంతో క్లిష్ట పరిస్థితుల్లో అనుభవజ్ఞులు ఉండట్లేదని, ప్రస్తుతం విరాట్ కోహ్లి, డుప్లెసిస్, కామెరూన్ గ్రీన్, మాక్స్‌వెల్ టాప్-4లో బ్యాటింగ్‌కు వస్తుంటారని అంబటి రాయుడు పేర్కొన్నారు.

Just In

01

Bigg Boss Telugu Nominations: నామినేషన్స్‌లో ఊహించని ట్విస్ట్.. మాజీ కంటెస్టెంట్స్ రీఎంట్రీ.. గూస్ బంప్స్ ప్రోమో భయ్యా!

Highest Paid Actors: రెమ్యునరేషన్లలో వెనక్కి తగ్గేదే లే అంటున్న సౌత్‌ యాక్టర్లు..

Wine Shop Lottery: నేడే మద్యం షాపులకు లక్కీ డ్రా.. ఆశావహుల్లో ఉత్కంఠ

Gold Price Today: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు?

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం